ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మొదట కరోనా  వైరస్ విజృంభణ  దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ విధించింది . ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా  ప్రభావం ఇప్పుడే భారతదేశంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ పొడగిస్తారా  లేదా అక్కడితో ఆపేస్తారా  అనే చర్చ మొదలైంది. అటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్  కొనసాగిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అలాంటి సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలను సమన్వయం చేస్తూ ఒక్క తాటిపై నడిచేలా ప్రభావితం చేస్తూ వస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అయితే తాజాగా ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్ కొనసాగించాలా వద్దా అనే దానిపై దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమావేశం నిర్వహించారు. 

 


 ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్ డౌన్  కొనసాగించాలా వద్దా అనే దానిపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఒకవేళ లాక్ డౌన్  పొడిగిస్తే ఎలాంటి మినహాయింపులు కావాలి అనే దానిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో  లాక్ డౌన్  మరో 15 రోజులు పొడిగింపు ఖాయమైంది. ఎలాంటి ఉపన్యాసం లేకుండానే లాక్ డౌన్  పొడగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని రకాలైన మినహాయింపు లకు సంబంధించిన అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

 


 ఈ మినహాయింపులో  ధాన పరిశ్రమలు నిర్వహించుకోవడానికి, పంటకోత ప్రాసెసింగ్ జరపాలని, అలాగే ప్యాకేజీకి  కూడా ఎలాంటి నిబంధన పెట్టకూడదని, కోల్డ్ చైన్ కూడా కంటిన్యూ చేయాలని, మార్కెటింగ్ విభాగాలు కొనసాగేలా చేయాలని, అమ్మకాలు నడిచేలా  చేయాలని. ఆక్వా పరిశ్రమ  కంటిన్యూ చేయాలని, ఫీడ్ ప్లాంట్ లు వ ఆక్వేరియం చేపలు రొయ్యలు లాంటి ఉత్పత్తులు లాంటి వాటిపై ఎలాంటి  నిబంధనలు విధించకూడదనే మినహాయింపులు  కావాలి అని ముఖ్యమంత్రులు దేశ ప్రధాని నరేంద్ర మోదీని వీడియో కాన్ఫరెన్స్ లో  కోరారు. 

 

 అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగానే ఉత్తర్వులు జారీ చేస్తూ లాక్ డౌన్  పొడిగించింది. అయితే దీని వల్ల ట్రాఫిక్ మళ్లీ పెరుగుతుంది అంటున్నారు విశ్లేషకులు. పబ్లిక్ కూడా చాలామంది రోడ్లపై తిరుగుతూనే ఉంటారు  అని .. ఇలా జరగడం వల్ల ఎదురయ్యేటువంటి సవాళ్లను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి సమస్యలు రావని... కానీ ఎలాంటి నిబంధనలు లేవు కదా అని  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం.. భారత్ మరింత క్లిష్టపరిస్థితుల్లో పడడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: