జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ కారణంగా చూపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పెద్ద చర్చ జరిగింది. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల వాయిదా విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి జస్టిస్ కనకరాజు ను  నూతన ఎన్నికల కమిషనర్ గా నియమింపబడటం  ప్రస్తుత ఆంధ్రా రాజకీయాలో  సంచలనంగా మారింది. అయితే దీనిపై ప్రతిపక్ష టిడిపి పార్టీ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 

 

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను  ఎన్నికల కమిషనర్ గా తప్పించారు అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయమై టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ జీవోలను  తీసుకువచ్చింది అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమిషనర్ ను తప్పించడం విషయంలో జగన్ సర్కార్ కు కోర్టు మొట్టికాయలు వేయడంతో ఖాయమంటూ వ్యాఖ్యానించిన దేవినేని ఉమామహేశ్వర రావు .. ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

 జగన్మోహన్ రెడ్డి సర్కార్  తప్పుడు జీవోలను తీసుకొచ్చినప్పుడు గవర్నర్ కార్యాలయం వాటిని సరి చేయకుండా వంతవాడరాదు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా  వైరస్ ఎఫెక్ట్ రోజురోజుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులు లేక రాష్ట్ర  వ్యాప్తంగా మామిడి రైతులందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారని.. ఇలాంటి నిజాలు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేదు అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా  వైరస్ కోరలు చాస్తుంటే  లాక్ డౌన్ ఎత్తివేస్తాము  అంటూ జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి వచ్చిన ఐపీ విద్యార్థులను క్వారంటైన్ లో  పెట్టిన జగన్ సర్కార్ చెన్నై నుంచి వచ్చిన కనుక రాజును  ఎందుకు క్వారంటైన్ లో పెట్టలేదు అని ప్రశ్నించారు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి కూడా క్వారంటైన్ కి  తరలించాలి అంటూ పేర్కొన్నారు టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: