కరోనా వైరస్ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. రోజురోజుకు దీని ప్రభావం పెరుగుతుంది తప్ప ఎక్కడా అదుపులోకి వస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వైరస్ కట్టడి విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చైనాలో ఈ మహమ్మారిని కట్టడి చేసినట్టు కనిపిస్తున్నా ఇంకా కొత్త కొత్త కేసులు అక్కడ బయట పడుతున్నాయి. అమెరికాలోనూ ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మన దేశం విషయానికి వస్తే ఇక్కడ సుమారు పది వేలకు పైగా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ విషయంపై జ్యోతిష్యులు  రకరకాలుగా స్పందనను తెలియజేస్తూ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

 


వీరు ఆషామాషీగా అయితే భవిష్యత్తును చెప్పడం లేదు. గ్రహాల కదలికల ఆధారంగా దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ లో సూర్యుడు, చంద్రుడు, గురువు, శని, కేతు, ధనస్సు రాశి లో ఉన్నాయని, ఆ గ్రహం ను రాహు చూస్తున్నాడని వారు చెబుతున్నారు. అలాగే మకర రాశిలో శని, కుజ గురువులు కలుసుకోవడం వల్ల గతంలో ఎప్పుడు చూడని దారుణమైన పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నామని చెబుతున్నారు. గురు గ్రహం మంచిదే అయినా, మార్చి 30 నుంచి జూన్ 30 వరకు మకర రాశిలో ఉంటుందని, అది గురుగ్రహానికి మంచిది కాదు అంటూ జ్యోతిష్యులు తమ వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు శని, గురు గ్రహాల కలయిక తర్వాత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుని లాక్ డౌన్ ని ప్రకటించిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

 


 ఫ్లూటో గ్రహంను యమునితో పోలుస్తారు. ఆగ్రహం శనితో కలవడం వల్ల ఇప్పుడు ఇటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడినట్లు వారు చెబుతున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితే తలెత్తడంతో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినట్లుగా వారు చెబుతున్నారు. 1982లో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని, 2019 డిసెంబర్లో ఈ రెండు గ్రహాలు దగ్గర అయిన కారణంగానే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. అలాగే జనవరిలో శని, ఫ్లూటో గ్రహం తో పాటు, సూర్యుడు కూడా మకరరాశిలో రావడంతో వైరస్ ప్రభావం పెరిగినట్లుగా జ్యోతిష్యులు చెబుతున్నారు. మార్చి 31  న ఆ  గ్రహం తో కలవడం వల్ల మరణాల శాతం పెరిగినట్లు వారు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గురువు ఈ క్రమంలో దూరమవుతారని, వారు  దూరం అయ్యేకొద్ది వైరస్ ప్రభావం తగ్గడం మొదలవుతుందని, ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి వెళ్లడంతో ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుంటుందని, మే నెల చివరి నాటికి మొత్తం పరిస్థితులు చక్కబడతాయి అనేది జ్యోతిష్యులు చెబుతున్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: