దేశంలో కరోన రక్కసి ప్రభావం పెళ్లిళ్లపై ఎక్కువగా పడింది. పెళ్లిలా సీజన్ కావడం వలన ఆర్థిక పరంగా చాల కల్యాణ మండపాలు నష్టపోతున్నాయి. గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలన్న వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సూచనలు, లాక్‌డౌన్‌ అమలుతో కల్యాణ మండపాలు, దేవాలయాలు మూసుకుపోయాయి. దీంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు వాయిదాపడ్డాయి. 

 

కరోనా లాక్ డౌన్ లో ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏ చిన్న కార్యం కూడా ప్రశాంతంగా జరిగే సూచనలు కనపడటం లేదు. కరోనా వైరస్ నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక పెళ్లి అందరిని ఆశ్చర్యాని కలిగిస్తుంది.

 

తాజాగా ప్రభుత్వం పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చింది. ఆ పెళ్ళిలో అమ్మాయి తరుపున ముగ్గురు అబ్బాయి తరుపున ముగ్గురు ఉండాలని తెలియజేసింది. అయితే తాజాగా ఒక్క పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కూడా తమ వివాహం సమయంలో మాస్క్‌లు, గ్లోవ్స్ ధరించారు. తమ పెళ్ళికి స్నేహితులను, బంధువులను పిలవలేదు. కేవలం అమ్మాయి తరుపు ఒక ముగ్గురు అబ్బాయి తరుపున ఒక ముగ్గురు… ఆరుగురి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పంతులు ఉంటారు. ఇద్దరినీ పిలవకుండా ఒక్కరినే పిలిచి ఈ వివాహం చేసుకున్నారు.

 

పూజ, దిశాంక్‌ లు ఇలాగే గురువారం చాలా జాగ్రత్తగా వివాహం చేసుకున్నారు. అది కూడా ఇంటి టెర్రస్ మీద ఈ వివాహం జరిగింది. తల్లి తండ్రులు కూడా గ్లోవ్స్ ధరించి ఈ వివాహం చేసుకున్నారు. అదే విధంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బంధుమిత్రులకు వీడియోకాల్స్ లో చూపించామని వరుడు వివరించాడు. ఇక పెళ్లి ఖర్చులు తగ్గడంతో దీనిపై ఇప్పుడు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అన్నీ మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలల్లో పెళ్లిళ్లకు అన్ని కల్యాణ మండపాలు బుక్‌ అయ్యాయి. కరోనా దెబ్బతో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం మండపం మూసివేయాల్సి వచ్చింది. సీజన్‌లో మాత్రమే మాకు వ్యాపారం ఉంటుంది. వ్యాపారపరంగా తీవ్రంగా నష్టపోతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: