భారతదేశం ముందు నుంచి కరోనా  వైరస్ బాధితులను గుర్తించడానికి థర్మల్  స్క్రీనింగ్ అనే ఒక విధానాన్ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్  గుర్తించి ఒకవేళ కరోనా  వైరస్ లక్షణాలు ఉంటే వారిని నేరుగా ఐసోలేషన్ కు  తరలించేలా  చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వ. కానీ ఈ థర్మల్  స్క్రీనింగ్ పద్ధతి అంతగా వర్క్ ఔట్ అయినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ థర్మల్  స్క్రీనింగ్ ద్వారానే ఇండియాలో వైరస్ పెరిగిపోవడానికి కారణం అయింది అని పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు. కరోనా  వైరస్ బాధితులను గుర్తించడానికి దేశంలోని అన్ని విమానాశ్రయాలలో స్క్రీనింగ్ పెట్టినప్పటికీ... అది సరైన ఫలితాలను ఇవ్వలేకపోయింది అంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా తాజాగా స్పష్టం చేసింది. 

 

 

 ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా  వైరస్ బారినపడి విదేశాల నుంచి వస్తున్న వారిని దాదాపుగా ధర్మల్  స్క్రీనింగ్ 46 శాతం మందిని కనిపెట్టలేక పోయి ఉండవచ్చు అనే ఆందోళన వ్యక్తం చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్. అయితే తమకు కరోనా  వైరస్ కు సంబంధించిన లక్షణాలు లేవు అనే కారణంతో కరోనా  వైరస్ సోకిన వారు కూడా చాలామంది ఐసొలేషన్  కు వెళ్లకుండా యధేచ్చగా బయట తిరగడానికి ఇదొక అవకాశం గా మారిపోయింది అంటూ తెలిపింది. జనవరి 15న దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో  ధర్మల్ స్క్రీనింగ్  విధానాన్ని ప్రారంభించక ముందు.. భారతదేశానికి ఏకంగా 5,700 మంది ప్రయాణికులు ఇతర కరోనా  ప్రభావిత దేశాల నుంచి ఇండియాకు వచ్చారు. 

 

 

 కాగా అలా వచ్చిన వారిలో కేవలం 0.3 శాతం మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది . దేశంలో 26 శాతం మందికి కరోనా  వైరస్ సోకే అవకాశం ఉందని... ప్రతి నాలుగు వందల యాభై మందిలో ఒకరు చనిపోవచ్చని   ఐసీఎంఆర్ అంచనా వేసింది. ఇది లాక్ డౌన్  కి ముందు ఉన్న పరిస్థితుల ఆధారంగా ఐసీఎంఆర్ లెక్క వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్క్రీనింగ్ ద్వారా కేవలం ఒక మనిషి బాడీలోని టెంపరేచర్ ను  మాత్రమే గుర్తించవచ్చని అయితే విదేశాల నుంచి కరోనా  వైరస్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఏదైనా జ్వరాన్ని కంట్రోల్ చేసే టాబ్లెట్ వేసుకుంటే రెండు మూడు గంటల పాటు ఆ జ్వరాన్ని  కంట్రోల్ అవుతుందని.. ఆ  సమయంలో థర్మల్  స్క్రీనింగ్ చేయడం ద్వారా ఎక్కువగా టెంపరేచర్  ఉన్నట్టు కనిపించదని తద్వారా వారిని ఐసొలేట్  చేయకుండా వదిలేయడం ద్వారా కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా పెరిగిందని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: