రంజాన్ మాసం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హలీం. హైదరాబాద్‌లో ఏ గల్లీ చూసిన హలీమ్ ఘుమఘుమలే మనకు కనిపిస్తాయి.  చిన్నా పెద్ద హాటల్స్ లో హలీం స్పెషల్ ఉంటుంది.  నగరవాసులు కూడా రంజాన్ నెలంతా దొరికే హలీమ్‌ను లొట్టలేసుకుంటూ తింటారు. కొందరు ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకొని మరీ టేస్ట్ చేస్తుంటారు. అందరికీ ఇష్టమైన హలీం ఈ ఏడాది లేదంటున్నారు హలీమ్ తయారీ అసోసియేషన్. చికెన్, మటన్, వెజ్ హలీమ్‌లను లొట్టలేసుకుంటూ తింటుంటారు. నగరవాసులకే కాదు హైద‌రాబాద్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన ఫుడ్ ఐట‌మ్స్ లో హ‌లీమ్ ఒక‌టి.

 

రంజాన్ మాసంలో మాత్ర‌మే దొరికే హ‌లీమ్ ను ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు.  ఒక రకంగా చూస్తే హ‌రీశ్, హ‌లీం, కుర్బానీ కా మీఠా, డ‌బుల్ కా మీఠా, రుమాలీ రోటి, చికెన్ టిక్కా, షామీ, ద‌హీవ‌డ ప్ర‌ధాన‌మైన‌వి. మంచి రుచితో పాటు...ఉప‌వాస స‌మ‌యంలో ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన‌.. శక్తిని అందిస్తాయి. హలీం కోసం జనాలు బారులు తీరుతారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా హోటళ్లు హలీం ఘుమఘుమలు వెదజల్లుతాయి. కానీ, ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. 

 

తెలంగాణలో మే 7 వరకు ఆంక్షలు ఉంటాయని, ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని మతాల వారు పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసంలోనూ ముస్లింలు బయటికి రాకుండా ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని  చెప్పారు.  రంజాన్ మాసంలో తెల్లవారుజాము నుంచి ఉపవాసం ఉండేవారు.. సాయంత్రం ఈ హలీం తింటే వెంటనే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయని దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో రంజాన్ మాసంలో ఈ హలీంకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: