ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు  కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్  ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు అని సూచించింది. ప్రజల సహకారంతోనే కరోనా  వైరస్ పై విజయం సాధించగలమని అందువల్ల ప్రజలందరూ కేవలం ఇంటికే పరిమితం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సూచనలు ఆదేశాలు చేసినప్పటికీ చాలామంది రోడ్లమీద నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ టౌన్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

 

 

 ఓ వైపు అధికారులు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే ప్రజలు మాత్రం వారికి సహకరించడం లేదు. అటు పోలీసులు కూడా ప్రజలకు బయటకు రావద్దు అంటూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పలుచోట్ల ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా బయటకు వస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి పోలీసులు వెరైటీ శిక్షలు వేస్తూ మళ్లీ రోడ్డుమీదికి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు రూరల్ కు సంబంధించిన కొల్లూరు పోలీసులు ఓ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మేము తప్పు చేసాము అంటూ పలువురు వాహనదారులు తో ఐదు వందల సార్లు పేపర్ మీద రాయించి శిక్షిస్తున్న  పోలీసులు తాజాగా మరో కొత్త రకమైన శిక్ష అమలు చేయబోతున్నారు. 

 

 

 లాక్ డౌన్  నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చేవారికి ఓ వినూత్న  శిక్ష విధించేందుకు పోలీస్ అధికారులు నిర్ణయించారు. నేను మూర్ఖుడిని.. నేను మాస్కు పెట్టుకోను.. పనీపాటా లేకుండా రోడ్లమీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను. ఈ రకమైన కామెంట్స్ ఉన్న ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి.. దాన్ని సెల్ఫీ పాయింట్ గా మార్చేసారు పోలీసులు. ఎవరైతే లాక్ డౌన్  నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బయటకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారిని ఇక్కడకు తీసుకొచ్చి సెల్ఫీ తీఇస్తున్నారు . అంతేకాకుండా ఫోటోను వారి వాట్సాప్ డీపీ గా తమ సొంత సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వినూత్నంగా శిక్ష విధిస్తున్నారు పోలీసులు. ఇలా చేయడం ద్వారా అయినా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: