కరోనా రాజకీయం ఏపీని కుదిపేస్తోంది. వైరస్ సంగతి ఎలా ఉన్నా...ఆ పేరుతో అధికార విపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. అధికార పార్టీ వైసీపీని ఇరుకున పెట్టే విధంగా టిడిపి, బిజెపి జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా, ఆ ప్రయత్నాలను వైసిపి నాయకులు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. అయితే ఈ సమయంలో ప్రభుత్వ తీరు క్షేత్రస్థాయిలో తప్పుపడుతూ రాజకీయ లబ్ది పొందుతూ, ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం టీడీపీ అధినేత చంద్రబాబుకు లేకుండా పోయింది. ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు. అసలు ఇంత కాలం ఏపీ రాజకీయాలకు దూరంగా తెలంగాణలో ఉండిపోవడం ఇదే మొదటిసారి. చంద్రబాబు ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోవడంతో అధికార పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.

 

 చంద్రబాబు హైదరాబాద్ కి లాక్ డౌన్ కి ముందు అకస్మాత్తుగా వెళ్ళడానికి కారణం ఆయన మనవడు దేవాన్ష్ కారణంగా తెలుస్తోంది. మార్చి 20వ తేదీన హైదరాబాద్ కు చంద్రబాబు వెళ్లారు. ఆయన మానవుడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు ఆయన కాస్త ముందుగానే అక్కడికి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా 22వ తేదీన జనతా కర్ఫ్యూ , 23 నుంచి నిరవధిక లాక్ డౌన్ విధించడంతో హైదరాబాద్ లోనే ఆయన ఉండిపోవాల్సి వచ్చింది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అయినా, బాబు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతోనూ, పార్టీ నేతలతోనూ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, చీఫ్ సెక్రటరీ, గవర్నర్, రాష్ట్రపతి ఇలా ఎవరిని వదిలి పెట్టకుండా, లేఖల ద్వారా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే చంద్రబాబు కరోనా వైరస్ కి భయపడి హైదరాబాద్ నుంచి  రావడం లేదంటూ ఏపీ అధికార పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. 


ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి రావాలంటే పోలీసుల. అనుమతి తీసుకుని రావొచ్చని, ఇప్పటికే చాలా మంది పోలీసుల అనుమతితో వెళ్తూ వస్తూ ఉన్నారని చెబుతున్నారు. అయితే చంద్రబాబు సీనియర్ సిటిజన్ కావడంతో ఆయనకు 70 సంవత్సరాల వయస్సు రావడంతో ఇప్పుడు అనవసర రిస్కు చేయడం ఎందుకు అన్నట్లుగా ఆయన తెలంగాణలో ఇంటికే పరిమితమై పోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూర్చుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. 


ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు టిడిపి నేతలు సిద్ధంగా లేరు. తమ అధినేత చంద్రబాబు భయపడి ఏపీ కి రావడం లేదు అనే దాంట్లో వాస్తవం లేదని, ఆయన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, ఏపీ ప్రభుత్వం వల్ల కరోనా కట్టడి సాధ్యం కాకపోతే బాబు  రంగంలోకి దిగి వారం రోజుల్లో కట్టడి చేసి చూపిస్తారు అంటూ టిడిపి నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే అసలు విషయం మాత్రం ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఏపీలో తిరగడం అంత శ్రేయస్కరం కాదు అన్న దృష్టితోనే తెలంగాణలో ఇంటికి పరిమితం అయిపోయినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: