ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ఎంతో  మందిని బలి తీసుకుంటోంది. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తూప్పటికీ ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈ మహమ్మారికి  ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే భారత్లో మలేరియా వ్యాధికి ఉపయోగించే హైడ్రోక్సీక్లోరోక్విన్  మందు  కరోనా  వైరస్ పై  శక్తివంతంగా  పోరాడుతుండటంతో   ప్రపంచం మొత్తానికి ప్రస్తుతం ఇండియాలో మలేరియా వ్యాధికి ఉపయోగించే హైడ్రోక్సీక్లోరోక్విన్  సంజీవనిలా మారిపోయింది. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఇండియా నుంచి హైడ్రోక్సీక్లోరోక్విన్ మందులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఈ మలేరియా మందు  పై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

 మలేరియా వ్యాధికి ఉపయోగించే హైడ్రోక్సీక్లోరోక్విన్  వల్ల దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. తాజాగా అమెరికా అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇదే  హెచ్చరించారు. మలేరియా వ్యాధి కి సంబంధించిన వ్యాక్సిన్ హృదయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నట్లు అక్కడ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గురించి ఔషధాలకు సంబంధించిన వివరాలను ముందుగానే పొందుపరిచినట్లు గుర్తు చేసింది. అయితే ఒక రోగి  పై ఈ మందులు వాడినప్పుడు.. ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి  ఆ వ్యక్తిపై దుష్ప్రభావాన్ని తగ్గించవచ్చు సూచిస్తున్నారు పరిశోధకులు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ మందు ఎంత మోతాదులో వాడాలి అనేది వైద్యుల పర్యవేక్షణలో జరగాలని చెబుతున్నారు. 

 

 

 మలేరియా సహా మరికొన్ని వ్యాధులకు డాక్టర్లు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలని తెలిపిన  పరిశోధనలు... అయితే ఈ మందులు ఎక్కువగా వాడటం వల్ల హృదయ స్పందన రేటు పెరిగి వెంట్రిక్యూలర్ కు  దారితీస్తుంది అంటూ హెచ్చరించారు. ప్రపంచ మహమ్మారి కి  సరైన విరుగుడు కనిపెట్టేందుకు పరిశోధన జరుగుతుందని... అప్పటివరకు ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈ మందులు వాడుతూ ఉండాలి అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు.తమ దేశంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మలేరియా మందు  హైడ్రోక్సీక్లోరోక్విన్  వాడుతున్నట్లు  చెప్పుకొచ్చారు. కరోనా  బారినపడి ఆరోగ్యం విషమించిన  వారికి మాత్రమే ఈ మందులు వాడుతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: