ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే మొన్నటి వరకు ఎవరినుండి ఎవరికి కరోనా  వైరస్ సోకింది అన్నది స్పష్టంగా తెలిసేది. కానీ ప్రస్తుతం ఎవరినుండి ఎవరికి కరోనా  వైరస్ సోకుతుంది అన్నది మాత్రం గుర్తించలేకపోతున్నారు అధికారులు. అంతే కాకుండా అటు కరోనా  వైరస్ బారిన పడిన వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో డాక్టర్లకు కరోనా పేషంట్లను గుర్తించడం మరింత క్లిష్టంగా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నటువంటి ఏరియాలో కృష్ణాజిల్లా ముఖ్యంగా విజయవాడ ఒకటి.  అయితే విజయవాడలో అంతగా కరోనా  వైరస్ కేసులు పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే అక్కడ అసెంప్టమాటిక్  కేసులు ఎక్కువవుతున్నాయి అని చెబుతున్నారు స్థానికులు

 


 మర్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన వారి నుంచి కొంతమందికి  వైరస్ సోకితే వారి నుంచి ఇంకా చాలామందికి  వైరస్ సోకడం  రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాళ్ల ద్వారా మరొకరికి సోకడం. ఇలా  తెలియకుండా ఇలా ఎవరి నుంచి ఎవరికీ  వైరస్ సోకుతుందో తెలీకుండా కొత్త  కేసులు నమోదవుతున్నాయి. అయితే వైరస్ మొదట సోకిన వారికి టెస్టులు చేస్తే నెగిటివ్ వస్తే వారికి సంబంధించిన వారికి మాత్రం పాజిటివ్ వస్తుంది. అయితే నెల రోజుల తర్వాత కూడా ఈ మహమ్మారి వైరస్ లక్షణాలు బయట పడడం లేదు . ఈ అంశం ప్రస్తుతం అటు వైద్య అధికారులు ఇటు ప్రజలను  తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 

 


 ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న రాపిడ్ టెస్ట్ కిట్ ల  ద్వారా పరీక్షలు చేస్తుంటే  పాజిటివ్ కేసులు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అంతేకాకుండా కూరగాయలు సహా మిగతా ఇతర అత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి పెద్దపెద్ద ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేశారు అధికారులు. కానీ అక్కడ ప్రజలకు  కొంత సమయం ఇవ్వడం కారణంగా ఎలాంటి సామాజిక దూరం పాటించడంలేదు  దీంతో ఈ విధంగా కూడా కరోనా  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి . మరి విజయవాడలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి.. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందని చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: