టీవీ 5 మూర్తి అరెస్టు కాబోతున్నాడు.. అరెస్టుకు రంగం సిద్ధం.. ఇప్పటికే మూడు కేసులు నమోదు.. మూర్తి అరెస్టు కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు.. ఇదిగో అరెస్టు.. అదిగో కేసు.. ఇలా రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు. దీనికితోడు రెండు రోజులుగా ఆయన టీవీ5 తెరపై చర్చలు నిర్వహించకపోవడం కూడా ఈ అనుమానాలకు తావిచ్చింది.

 

 

అయితే వీటన్నింటిపై ఇప్పుడు స్వయంగా టీవీ5 మూర్తే వివరణ ఇచ్చారు. శుక్రవారం ఓ డిబెట్ నిర్వహించిన ఆయన ముందుగా తన అరెస్టు వార్తల విషయంపై స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే.. “ నన్ను అరెస్టు చేయబోతున్నారంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం చూసి నన్ను ప్రేమించే ఆత్మీయుల నుంచి వందలు, వేల కొద్దీ సందేశాలు వచ్చాయి. అలాగే నన్ను వ్యతిరేకించేవారూ ఉన్నారు.

 

 

అయితే రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులు నేను వినియోగించుకునేందుకు నా ఆత్మీయులు కొందరు రెండు రోజులుగా ఈ ప్రచారం సాగించారు. అందులో భాగంగానే నేనూ రెండు రోజులు డిబేట్ లు నిర్వహించలేకపోయాను. ఇక నా విషయానికి వస్తే.. నేను ఇప్పటి వరకూ ఏ తప్పు చేయలేదు. ఇకపై కూడా చేయను. నాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కేసూ పెట్టలేదు. నాపై ఎలాంటి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయలేదు.

 

 

ఇప్పటి వరకూ నేను ఏ పార్టీకీ కొమ్ము కాయలేదు.. ఏ కులాన్ని వెనకేసుకురాలేదు. నేను ఓ జర్నలిస్టులు.. తప్పును నిలదీయడం నా ధర్మం. ఈ ధర్మపోరాటం ఇకపైనా కొనసాగిస్తా.. నాపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందని నేను భావించడం లేదు. చట్టబద్దంగా, న్యాయబద్దంగా నాపై చర్యలు తీసుకోవాలనుకుంటే నేను తప్పకుండా సహకరిస్తా.. అంటూ వివరణ ఇచ్చారు టీవీ మూర్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: