ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక లాక్  సమయంలో. మిగతా వారి పరిస్థితి ఎలా ఉన్న...  మందుబాబులకు పరిస్థితి అయితే ఆగమ్యగోచరంగా మారిపోయింది. రోజు ఒక పెగ్గు వేస్తే కానీ రోజు గడవని మందుబాబులకు మద్యం షాపులు నెల రోజుల నుండి మూసివేయడంతో ఏం చేయాలో అర్థం కాక నెత్తి నోరు కొట్టుకున్నారు . కొంతమంది అయితే ఏకంగా పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. నెలరోజులకు పైగా మద్యం   షాపులు మూసి వేయడం రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు కావడంతో కనీసం బ్లాక్ లో దొరికే పరిస్థితి కూడా లేకపోవడంతో మందుబాబుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది.

 

 

 అయితే ఏప్రిల్ 15 తర్వాత లాక్ డౌన్   ఎత్తి వేస్తారు ఆ తర్వాత మద్యం షాపులు తెరుస్తారు అని ఎంతో ఆశగా ఎదురుచూసిన మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఎందుకంటే వైరస్ ప్రభావం దేశంలో ఇంకా తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మందుబాబులకు మరోసారి నిరాశే ఎదురయింది అని చెప్పాలి. ఇక కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగిసిపోతుంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ రాష్ట్ర పరిధిలో కొన్ని సడలింపులు చేస్తున్నాయి. 

 

 

 ఈ క్రమంలోనే మద్యం షాపుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రీన్ ఆరెంజ్ జొన్ లలో  ఈనెల 4 నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్  పూర్తయ్యే వరకు కేవలం మద్యం షాపులు మాత్రమే తెరవాలని బార్ అండ్ రెస్టారెంట్లు తెరవకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక మద్యం షాపుల వద్ద ప్రజలు గుమిగూడ  కుండా ఉండేందుకు సామాజిక దూరం పాటిస్తూ అమ్మకాలు జరిగేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. అయితే జిల్లాలను రెడ్ జోన్లుగా తీసుకోవాలా లేదా మండలాలను రెడ్ జోన్ లుగా  తీసుకోవాలా అనే దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: