ప్రస్తుతం రోజురోజుకు  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ మహమ్మారి వైరస్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ నాలుగు ఐదు రాష్ట్రాల కారణంగా ఏకంగా భారతదేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీ మొత్తంలో పెరిగిపోతోంది. అయితే కరోనా  లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గౌరవిస్తూ... ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ విమర్శలు తగ్గిపోయాయి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. 

 

 అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ లాంటి కష్టకాలంలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.  ఇక భారతదేశంలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో.. రాహుల్ గాంధీ చేసిన ఒక పోలిక పై  ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో కేసులు పెరుగుతున్నాయి అనడానికి పోలిక ఏ  దేశాలతో పెట్టారు అంటే పాకిస్తాన్, ఇండోనేషియా, సింగపూర్, జపాన్ దేశాలతో పోలిక పెట్టారు రాహుల్ గాంధీ. అన్ని దేశాలలో భారతదేశం కంటే ఎక్కువగానే కేసులు ఉన్నాయని భారత దేశంలో మాత్రం 70 వేల కేసులు దాటిపోయాయి  అంటూ ఒక పోలిక పెట్టారు రాహుల్ గాంధీ. 

 

 ప్రస్తుతం దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని... కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా సమర్థవంతంగా కరోనా  వైరస్  నియంత్రించలేకపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై విశ్లేషకులు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆయన పోలిక పెట్టిన దేశాలకు భారతదేశానికి మధ్య ఉన్న పోలిక రాహుల్ గాంధీకి తెలీదా...  లేదా జనాలకు తెలియకూడదు అని ఇలా చెబుతున్నారా  అర్థంకాని పరిస్థితి ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ఒక జపాన్ మినహా మిగతా దేశాలన్నీ అతి చిన్న దేశాలు అని అంటున్నారు విశ్లేషకులు. ఈ మొత్తం దేశాలు కలిపితే భారత్ లోని  రెండు మూడు పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన జనాభా ఉంటుందని...ఈ వ్యాఖ్యలను బట్టి రాహుల్  భవిష్యత్తు ఉంది ఎలా ఉంది..ఆయన ఊహ శక్తి ఎంత ఎక్కువగా ఉంది  అని అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: