ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పలు దేశాలు లాక్ డౌన్ లో సడలింపులు విధిస్తుంటే... పలు దేశాలు లాక్ డౌన్ ను ఎత్తివేయడం ప్రారంభించాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లాక్ డౌన్ ను సడలిస్తున్న దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
లాక్ డౌన్ నిబంధనలు సడలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్​వో సూచించింది. డబ్ల్యూహెచ్​వో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించినా, ఎత్తివేసినా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. చాలా మందిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తక్కువ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయని దేశాల్లో మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు సడలించాయని... ఆ దేశాలలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తేలిందని పేర్కొంది. కెనడాలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత వైరస్ విజృంభించినట్లు పేర్కొంది. జర్మనీలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని... దక్షిణ కొరియాలో ఆంక్షలు సడలించిన తరువాత నైట్ క్లబ్ ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిందుకు డబ్ల్యూహెచ్​వో సిద్ధమైంది. 
 
డబ్ల్యూహెచ్​వో డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాల చర్యలు సమర్థవంతంగా ఉన్నాయని అన్నారు. అయితే పలు దేశాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమకు తెలిసిందని... కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండి లాక్ డౌన్ సడలింపులు అమలు చేయాలని సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు కార్యాలయాలను క్రమంగా శానిటైజ్ చేయాలని సూచించారు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: