విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనను సీరియస్ గా  తీసుకున్న జగన్ సర్కార్ ఈ ఘటనపై సత్వర చర్యలకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ఏకంగా కొంత  మంది ప్రాణాలు సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఏకంగా ఇప్పటివరకు ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని అందించి చరిత్ర సృష్టించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ ఘటనలో రెండు రోజుల మించి  చికిత్స తీసుకుంటున్న బాధితులందరికీ ఏకంగా లక్ష రూపాయల పరిహారం అందించింది  జగన్ సర్కార్. 

 

 

 ఇక ఈ పరిహారం సత్వరంగా అందేలా చర్యలు కూడా చేపడుతుంది. అయితే తాజాగా విశాఖ గ్యాస్ లీకేజీ  బాధితులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి  ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితులందరికీ భరోసానిచ్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటాము  అంటూ తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తు ప్రమాద దృశ్యాలు ఎల్జీ కంపెనీ అక్కడినుంచి తరలిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.. 

 

 

 ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పుడూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో బాధితులందరికీ భరోసా ఇస్తున్న క్రమంలో అక్కడ బాధితులు అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాము  అంటూ విశాఖ గ్యాస్ బాధితులు అందరూ తెలిపారు. విశాఖ గ్యాస్ బాధితులు అందరూ... ముఖ్యమంత్రి జగనన్న చేసిన సహాయానికి రుణపడి ఉంటామని ఒకటే మాట చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: