అదేంటోగాని ప్రస్తుతం ఎక్కువ పెళ్లిళ్లు లాక్ డౌన్ లోనే  జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఓవైపు కరోనా  విజృంభించి చాలామందిని  ప్రాణ భయంతో వణికిస్తూ  ఉంటే మరోవైపు లాక్ డౌన్  నిబంధనలు  ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎవ్వరూ వెనుకడుగు వేయడం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్  అమల అవకముందు పెళ్ళి నిశ్చయమైన వాళ్ళు  చాలామంది లాక్ డౌన్  సమయంలోనే  పెళ్లి చేసుకున్నారు. కాకపోతే పెళ్లి మండపం లో కాదు... కొంతమంది వీడియో కాల్ ద్వారా సోషల్ మీడియాలో పెళ్లి చేసుకుంటే ఇంకొంతమంది మరింత వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. ఏదేమైనా లాక్ డౌట్  నిబంధనలు ఉన్నప్పటికీ పెళ్లిళ్లు మాత్రం అస్సలు ఆగడం లేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవరూ వెనుకాడటం లేదు. 

 


 ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులతోపాటు ఇంకెంతో మంది ప్రముఖులు కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తూ తక్కువ మంది ఉన్నా సరే పెళ్లి మాత్రం జరగాల్సిందేనని పట్టుబడుతున్న విషయం తెలుస్తుంది. ముఖ్యంగా సాధారణ సమయంలో కంటే ఈ లాక్ డౌట్  సమయంలోనే పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఇలాంటిదే జరిగింది. పంజాబ్ లోని పటియాల లో... యువరాజ్ అనే యువకుడు చందు ప్రీత్ సింగ్ అనే యువతిని  పెళ్ళిచేసుకున్నారు. అనంతరం ఈ ఇద్దరు నూతన దంపతులు మోటార్ బైక్ పై  వరుడు ఇంటికి బయల్దేరారు. ఇక ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ జంటను పోలీసులు ఆపి ఏకంగా దండలు వేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 అయితే కేవలం ఈ  ఒక్క జంట మాత్రమే కాదు ఎంతో లాక్‌డౌన్‌ సమయంలో సాదాసీదాగానే పెళ్లితంతు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సడలింపు వచ్చాయి కాబట్టి కొంత మంది బంధుమిత్రుల మధ్య ఆయన వివాహం జరిగే అవకాశం ఉంది కానీ అంతకుముందు సంపూర్ణ లాక్ డౌన్  కొనసాగిన సమయంలో మాత్రం కనీసం ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి కూడా అవకాశం లేకపోవడంతో చాలా జంటలు ఆన్లైన్ ద్వారా రింగులు మార్చుకోవడం పెళ్ళి తంతు జరుపుకోవడం లాంటి ఘటనలు మనం అప్పుడే చూశాము  కూడా. అదేంటోగాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారందరూ లాక్ డౌన్ సమయాన్ని సుముహూర్తంగా  భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: