తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 107 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2098కు చేరింది. అయితే ఈ కేసులు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో తెలిసి షాక్ అవ్వడం అధికారుల వంతయింది. కొన్ని జిల్లాల్లో విచిత్రమైన కరోనా లింకులు బయటపడుతున్నాయి. హైదరాబాద్ జియాగూడ కాంటాక్ట్ ద్వారా ఒక్క సిగరెట్‌తో ముగ్గురికి కరోనా సోకింది. 
 
హైదరాబాద్ జియాగూడలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు హాజరయ్యాడు. ఆ తరువాత అక్కడ కార్యక్రమాన్ని ముగించుకుని షాద్‌నగర్ వెళ్లి ఇద్దరు వ్యక్తులతో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు సిగరెట్ షేర్ చేసుకోవడంతో ముగ్గురికి కరోనా సోకింది. అధికారులు ఆరా తీయగా జియాగూడ అంత్యక్రియలకు హాజరు కావడం వల్ల కరోనా సోకినట్టు తేలింది. 
 
ఈ మూడు కేసులతో షాద్ నగర్ లో కరోనా కేసుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే యువకుడు షాద్ నగర్ నుంచి జియాగూడ వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతుంది. కేసుల సంఖ్య పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు షాద్‌నగర్ ప్రాంతంలో శానిటైజేషన్ చేపట్టారు. స్థానికులు సైతం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. కొత్త కేసులు నమోదు కాకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు. చేపడుతోంది. రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కరోనా తగ్గుముఖం పట్టగా మరలా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో అధికారులు నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: