కిమ్ ఇది ఒక పేరు కాదు. ఒక ఆటం బాంబు. ఏ క్షణాన ఎవరి మీద పేలుతుందో తెలియని ఓ అణు బాంబు. శత్రు దేశాలకే కాదు సొంత దేశం వారికీ కిమ్ అంటే చచ్చేంత హడల్. తేడా వస్తే చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టాడు ఏకంగా శాల్తీ లేపెయ్యడమే కిమ్ కి తెలుసు. అందుకే నార్త్ కొరియాలో కిమ్ క్రమ శిక్షణకి భయపడి జనాలు, అధికారులు క్షణం క్షణం భయం భయంగా బతుకుతూ బతుకు ఈడ్చుకొస్తుంటారు. కిమ్ తో ఎప్పుడూ టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది పరిస్థితి. సరేలే ఇది ఎప్పుడూ ఉండే పరిస్థితే కదా అని ప్రపంచ జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు. 

IHG's bizarre 'time travel' claim may ...


ఇక విషయానికి వస్తే... ప్రపంచం అంతా కరోనా భయంతో కంగారు పడుతుంటే, నార్త్ కొరియాలో మాత్రం ఆ ప్రభావం ఏమి లేదు అంటూ ఇప్పటి వరకు గొప్పగా ప్రకటించుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. కానీ ఇప్పుడు కరోనాకు తీవ్రంగా వణికిపోతున్నట్టు తెలుస్తోంది. కరోనా మరింతగా విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికార్లకు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చాడు కిమ్. ఎవరైనా ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు. మన దేశం లో కరోనా వ్యాప్తి చెందకుండా, గట్టి నివారణ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాలని, ఒక్క కరోనా కేసు నమోదైన తీవ్రమైన పరిణామాలను అధికారులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

IHG'a nice note' - Stripes


 ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విషయంలో చాలా బలహీనంగా ఉన్నా నార్త్ కొరియా, దేశం లో వైరస్ రాకుండా ఉండేందుకు సరిహద్దులను ఎప్పుడో మూసివేసింది. అంతేకాకుండా దేశమంతా లాక్ డౌన్ విధించింది. ఇప్పటికే కరోనా అనుమానం ఉన్న ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. ఏ ఒక్క విషయంలో అధికారులు నిర్లక్ష్యం కనిపించినా ఆ తరువాత తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, అప్పుడు పరిస్థితులు దారుణంగా ఉంటాయి అంటూ ఇప్పటికే అధికారులకు కిమ్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: