ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయిలపై వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అమ్మాయిలకు అసభ్యకర సందేశాలు పంపించడం, ఫోన్ కాల్స్ లో వేధించడంలాంటి పనులు చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో శృతి మించి ప్రవర్తించే వారి విషయంలో కఠిన చట్టాలు అమలులో ఉన్నాయి. 
 
ఆడవారి మీద అసహ్యకర, అసభ్య, జోకులు వేయడం, వారి పేర్లు ఫోటోలకు పెట్టడంలాంటివి చేయడం, ఆడపిల్లలను... పెళ్లి అయిన వారిని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం.. వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం.. పరువు నష్టం కలిగించడం, ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం చేసే వారిపై ఐటీ ఆక్ట్ 2000, ఐటీ ఆక్ట్ సెక్షన్ 66, ఐపీసీ సెక్షన్ 292, సెక్షన్ 354ఎ, 354డి (నిర్భయ చట్టం) సెక్షన్ 499 సెక్షన్ 66డి కింద కేసులు నమోదు చేయవచ్చు. 
 
ఐటీ ఆక్ట్ 2000 ప్రకారం ఆడవాళ్లను ట్రోల్ చేసినా, అసభ్యంగా కామెంట్లు చేసినా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసినా వారు నేరస్థులుగా పరిగణింపబడతారు. సోషల్ మీడియాలో అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తే ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. అసభ్యకర అంశాన్ని వీడియో, ఫొటో, టెక్ట్స్ ఏదైనా సరే షేర్ చేస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇదే పని మరోసారి చేస్తే 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 
 
మతాన్ని, వర్గాన్ని కించపరుస్తూ కామెంట్లు, పోస్టులు చేస్తే సెక్షన్ 295, సెక్షన్ 499 కింద కూడా కేసు పెడతారు. అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫొటో వాడితే చీటింగ్ కేసు నమోదవుతుంది. మార్ఫింగ్ చేస్తే అదనపు కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సెక్షన్ 499, సెక్షన్ 66డి కింద కేసులు నమోదవుతాయి. కొన్ని కేసుల్లో భాదితులు కంప్లైంట్ ఇస్తే ఉన్న జాబ్స్ పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది. పోస్ట్ డిలీట్ చేసినా సరే అతను / ఆమెతో జరిగిన ఒక సంభాషణ ద్వారా కేసులు నమోదు చేయవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: