మహాభారతం గురించి ఏమాత్రం తెలిసిన వారికైనా ధుర్యోధనుని తల్లి గాంధారి గురించి తెలిసే ఉంటుంది. మహాభారతంలోని మూలంలో ఆమె దృతరాష్ట్రుడికి భార్య. అంధుడైన భర్తవలె భర్తలాగే గంతలు కట్టుకుని జీవించింది. అంతే.. యుద్దరంగంలో ఇరువైపులా లక్షలాది సైన్యాన్ని రెండురోజులు అట్లాగే నిలబెట్టి, అర్జునుడిని మోకాళ్లమీద నిలబెట్టి శ్రీకృష్ణుడిచేత భగవద్గీత చెప్పించిన ఆధిపత్య భావజాలమే గాంధారిలో పతిభక్తి చూసింది.

 

 

దుర్మార్గం ఎమంటే గాంధారికి పేరు కూడా లేదు. ఆమె గాంధార ప్రాంతపు.. అంటే.. ప్రస్తుత వాయవ్య ప్రాంతపు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ రాజపుత్రిక. ఈమె సోదరుడు శకుని. గాంధార ప్రాంతం చరిత్రలో ఎప్పడు చూసినా సంప్రదాయేతర భావజాలానికు ప్రతినిధి. ప్రసిద్ద తక్షశిల అభ్యుదయ కళాశాల అక్కడే, బౌద్దం అక్కడే గొప్ప శాస్త్రాలు నేర్పింది, ప్రసిద్ద గాంధార శిల్పకళతో పాటు.

 

 

సహజంగానే సంప్రదాయ రాజరికం తరపున భీష్ముడు ఆ ప్రాంతం మీద దాడి నడిపి పాలకుడు సుబలని వోడించి కుటుంబాన్ని చెరబట్టి రాకుమారిని దృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేశాడు. తమ రాజ్యం ద్వంసంచేసిందిగాక, కుటుంబాన్ని కారాగారపాలు చేసిందిగాక, తన ప్రమేయంలేకుండా ఒక అంధుడికిచ్చి పెళ్ల్లిచేసిన ఈ వ్యవస్థమీద కసితీర్చుకోలేని నిస్సహాయతలో నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుని జీవించింది అభిమానవతియైన రాకుమారి.

 

 

ఈమె అన్న శకుని కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కో గింజ చొప్పున కారాగారంలో తిండిపెడితే, అందరూ కలిసి ఆ మెతుకుల్ని తమలో తెలివైనవాడికి తినిపించి తాము చచ్చి, శకుని బ్రతికించారు. అతడే కురువంశపు పతనానికి పునాదివేసి కురుక్షేత్రంలో మొత్తం వంశాన్ని నిర్మూలించాడు. దయచేసి గాంధారి నిస్సహాయతని, ప్రతీకారాన్ని, ఆత్మగౌరవాన్ని మగాధిపత్యపు గంతలు కట్టుకుని చూడకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: