ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు కరోనా  వైరస్ విజృంభిస్తున్నప్పటికీ... పెళ్లిళ్లు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కొంతమంది ఇలాంటి ముహూర్తం ఇప్పుడు పోతే మళ్ళీ రాదు అనుకొని ఏకంగా  డిజిటల్ వివాహాలు చేసుకుంటున్నారు. వరుడు వధువు ఎవరింట్లో వాళ్ళు ఉండి కేవలం వీడియో కాల్ ద్వారా వివాహాలు చేసుకొని సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు కరోనా  వైరస్ టైం లో. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు  ఇచ్చిన తర్వాత... కొంత మంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలోనే నిబంధనల ప్రకారం జరుపుకుంటున్నారు. కానీ కరోనా  వైరస్ టైం లో దాదాపుగా తమ పెళ్ళిళ్ళను  వాయిదా వేసుకున్న వారు  చాలా తక్కువ అనే చెప్పాలి. 

 


 ఇక సడలింపులు తర్వాత కొంతమంది నిబంధనలు పాటించి  పెళ్లి చేసుకుంటే కొంత మంది మాత్రం... ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తుంగలో తొక్కుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎంత గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే తాజాగా కరోనా  వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలోనే ఇక్కడ ఓ జంట పెళ్లి చేసుకోగా ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు వరుడు తో పాటు వారి తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేసారు  పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 

 

 మహారాష్ట్రలో ప్రస్తుతం మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య భారీ మొత్తంలో ఉన్న విషయం తెలిసిందే.అయితే తాజాగా  మహారాష్ట్ర రాయగడ్  జిల్లా కర్జాత్  లోని ముద్రే తహశీల్  ప్రాంతానికి చెందిన.. ఓ జంట గత ఆదివారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఈ శుభకార్యం జరపడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవడంతో పాటు కేవలం 50 మంది మాత్రమే హాజరుకావాలని నిబంధన ఉంది. కానీ వధూవరుల మాత్రం ఏకంగా తన పెళ్ళికి 50 మందిని కాదు.. 150 మందిని ఆహ్వానించారు. దీంతో కర్జాత్ కి  చెందిన సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిబంధనలకు విరుద్దంగా  వివాహం జరిపించిన వధూవరులు తో పాటు వారి తల్లిదండ్రులపై  కూడా కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: