తెలంగాణ జర్నలిస్టుల ఉపవాస దీక్షకు మద్దతు తెలిపిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ కరోనా వైరస్ పై పోరాటం చేయకుండా పూర్తిస్థాయిలో విఫలమైందని ధ్వజమెత్తారు. అలాగే ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వస్తే కార్పొరేట్ ఆసుపత్రు ఐన యశోదా లో ఎందుకు చికిత్స పొందుతున్నారని? ఉత్త ఆసుపత్రుల గాంధీ ఆసుపత్రిలో ఎందుకు చికిత్స చేయించుకోవడం లేదని ప్రశ్నించారు. 


ఆయన మాట్లాడుతూ... 'పేద ప్రజలకు ఎలాంటి గౌరవం ఇస్తుందో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి... ఏ ప్రతిపక్ష పార్టీని బయటికి రానివ్వకుండా, ఏ పాత్రికేయ మిత్రులను వార్తలు రాయనివ్వకుండా... ఒకవేళ రాస్తే వాళ్ళకి కరోనా వైరస్ సోకి చావాలని శాపనార్థాలు పెడుతున్నారు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కరోనా రావాలని శాపనార్థాలు పెట్టడం ఏమైనా బాగుందా? నీ పరిపాలనా వైఖరి వలన, నిర్లక్ష్యం వలన, ధన దాహం వలన చనిపోతున్న వారందరూ కలసి నీకు శాపనార్థాలు పెడితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను', 


'హైదరాబాద్ నగరంలో చాలా భయంకరమైన పరిస్థితిలు నెలకొన్నాయి. చాలామందికి టెస్టులు చేయకపోవడం వలన కరోనా పాజిటివ్ కేసులు బయటపడడం లేదు. చనిపోయిన వాళ్లకి కూడా టెస్టులు చేయాలంటే తాను చేయించకుండా నేను హైకోర్టుకి వెళ్తా, అప్పీల్ చేస్తానని చెబుతున్నాడు. ఒకవేళ అనుకూలమైన తీర్పు ఇస్తే న్యాయస్థానం చాలా గొప్ప తీర్పు ఇచ్చిందని పొగుడుతారు. ఇవ్వకపోతేనేమో ఈ నిర్ణయాన్ని మేము ఆమోదించమని హైకోర్టుకు వెళ్తాము, రాష్ట్ర కోర్టుకు వెళ్తామని చెప్పారు. ప్రతి పేదవాడికి 1500 రూపాయలు ఇవ్వాలి అంటే నేను ఇవ్వను అని కోర్టు కి పోతాం అంటారు'


'అధికార పార్టీకి సంబంధించిన ఒక శాసన సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చిందంట. దీంతో అతను యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారంట. ఫైవ్ స్టార్ హోటల్ కంటే చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పుడు... పాలకపక్ష శాసనసభ్యుడు ప్రభుత్వ ఆసుపత్రిని కాదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎందుకు యశోదా ఆస్పత్రిలో చేరారు? ఒకవేళ అతను గాంధీ ఆసుపత్రిలో చేరితే అక్కడ ఎంత గొప్పగా చికిత్స జరుగుతుందో ప్రజలకు తెలుస్తుంది. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు నాకు ఫోన్ చేసి మేము ట్రీట్మెంట్ చేయలేమా? మాకు వైద్య నైపుణ్యత లేదా? ఎమ్మెల్యే యశోద ఆస్పత్రిలో చేరి మమ్మల్ని అవమానిస్తున్నారు. తక్షణమే యాదగిరి రెడ్డి గారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించండి, సార్ అని వాళ్ళు అడుగుతున్నారు.

 

'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని ముఖ్యమంత్రి కావాలనే విషమించే పరిస్థితిని తీసుకొచ్చి అవన్నీ ఒక మంత్రిపై వేయడానికి కత్తి నూరుతున్నాడు. వచ్చేవారం ఆ మనిషి తల ఎగరబోతుంది. అతను మాకు ఎదురు తిరిగి ఈ జండాలో తనకు భాగస్వామ్యం ఉందని, ఉద్యమంలో తను భాగస్వాముడేనని అన్నాడు. అతనికి ఇప్పుడు టైం వచ్చింది. వచ్చేవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తల మంత్రివర్గం నుండి ఎగిరిపోతుంది. తన వైఫల్యాలను మొత్తం ఈటల రాజేందర్ ఖాతాలో వేసి అతన్ని దెబ్బకొట్టడానికి ముఖ్యమంత్రి అన్ని రకాల ప్రణాళికలు చేసుకున్నారు', అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: