రాజకీయంగా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో అడుగడుగున, ప్రతి విషయంలోనూ, టిడిపి అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వానికి అడ్డం పడుతూ వస్తున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి 151 సీట్లు సాధించగా, తెలుగుదేశం 23 స్థానాలను దక్కించుకుంది. అంటే వైసీపీకి అధికారపీఠం కట్టబెట్టారు. ఐదేళ్లు తమను పాలించే అవకాశం ప్రజలు కట్టబెట్టారు. ఈ ఐదేళ్లలో ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. ఎక్కడైనా ప్రభుత్వం గాడి తప్పుతోంది అనే భావన కలిగితే ప్రతిపక్షాలు దీనిపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ, అదే పని గా ప్రతి విషయాన్ని తప్పుబడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని, ప్రతి దశలోనూ అడ్డుకుంటూ వెళ్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ముఖ్యమైన మూడు నగరాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం తాను ప్రతిపాదించిన అమరావతిలోనే నిర్మాణాన్ని మొదలుపెట్టి అమరావతి పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఏపీ రాజధాని నిర్మించాలని కోరుతున్నారు. అంతేకాదు దీనిపై ధర్నాలు, ఉద్యమాలు చేపడుతూ అక్కడి కొంతమందిచే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాసనసభలో ఆమోదం పొంది శాసనమండలిలో ఆమోదం కోసం ఎదురు చూస్తున్న అనేక బిల్లులపై పైన శాసనమండలిలో ఆమోదమే లభించడంలేదు.  బిల్లు కాకుండా, టిడిపి సభ్యులు వ్యవహరిస్తూ శాసనమండలిలో ఆ బిల్లును పదేపదే ఆటాడుకోవడం వంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రస్తుతానికి రాజధాని విశాఖ కు తరలించే ఆలోచనలో ఉన్న జగన్ ఈ మేరకు శాసనసభలో బిల్లును ఆమోదించుకున్నా శాసనమండలిలో మాత్రం ఇప్పటి వరకు ఆ బిల్లు ఆమోదం పొందించుకోలేకపోయారు.

 


 శాసనమండలికి వచ్చిన ఏ బిల్లు ఆమోదం లభించకుండా చేసి జగన్ ను ఇరకాటంలో పెట్టే విధానం తో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలే అధికార పార్టీ, అందులోనూ తెలుగుదేశం పార్టీ ని నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ దశలో ఇలా కవ్వింపు చర్యలకు దిగితే జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: