నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీపై విమర్శలు చేసిన ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో, పార్టీ పైనే అయన తిరిగి తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కాదు అంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అసలు తనకు నోటీసు ఇచ్చే అర్హత విజయసాయి రెడ్డికి లేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు ఇది కాదని, యువజన రైతు శ్రామిక పార్టీ తమది అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి ఇప్పటికే ఆయనకు 18 పేజీల నోటీసు అందడంతో ఈ నోటీసు పైన ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.


 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ లెటర్ హెడ్ మీద ఎలా షోకాజ్ నోటీసు ఇస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీకి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ సంఘం అనేది ఉందా ? ఉంటే దానికి చైర్మన్ ఎవరు ? సభ్యులు ఎవరు ? ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా ? ఇలా అనేక  ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా అందరికీ ఆసక్తి రేపింది. ఆయన నేరుగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది. 

 


తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు చెల్లుబాటుపై ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ లెటర్ హెడ్ పై కాకుండా, మరో పేరుతో ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై ఎన్నికల సంగంలో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. వైసీపీ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు పార్టీ పైన ప్రశ్నలు వేస్తూ ఆయన సంజాయిషీ కోరుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన వైసీపీ పై ఫిర్యాదు చేయడంతో, కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అనేది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: