దేశంలో కరోనా విజృంభిస్తున్న మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఎదో ఒక్క ప్రాంతంలో ఎవ్వరో ఒక్కరు మహిళలపై అఘాయిత్యాలకు గురవుతూనే ఉన్నారు. దేశంలో కామాంధుల ఆగడాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన వృద్ధుల వరకు అందరిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మధ్య మత్తులో కొందరు అఘాయిత్యాలకు చేశారు. మరి కొందరు కామంతో రెచ్చిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వారి కామ కోరికలు తీర్చుకోవడానికి చిన్న,పెద్ద, అక్క, చెల్లా అంటూ ఎం పట్టింపులు ఉండవు.


కడుపునొప్పితో బాధపడుతోందని పద్నాలుగేళ్ల కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రులు షాక్‌కి గురైయ్యారు. పెళ్లి కాకుండానే కూతురు గర్భం దాల్చిందని చెప్పడంతో వారి గుండె బద్దలైంది. అమ్మాయిని నెమ్మదిగా ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా పక్కింటి కుర్రాడు రేప్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన యూపీలోని కాన్పూర్‌లొ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాన్పూర్‌లోని కాకాదేవో ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక(14) తల్లిదండ్రులతో కలసి నివాసముంటోంది.


బాలికపై కన్నేసిన పక్కింటి కుర్రాడు(16) దారుణానికి ఒడిగట్టాడు. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేసేవాడు. ఎవరూ లేని సమయం చూసి ఇంటికి వెళ్లి కామకోరికలు తీర్చుకునేవాడు. నాలుగు నెలలుగా బాలికకు నరకం చూపించాడు. తీరా బాలిక కడుపునొప్పి అని బాధపడుతుండడంతో దారుణం వెలుగు చూసింది.


కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. పెళ్లి కాకుండానే కూతురు గర్భం దాల్చిందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెబద్దలైంది. ఈ దారుణానికి పాల్పడింది ఎవరని అమ్మాయిని నెమ్మదిగా ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: