అది ఓ పర్యాటక కేంద్రం అక్కడకు ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అక్కడే వందల సంఖ్యలో కోతులు సంచరిస్తూ ఉంటాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు ఇచే అరిటపండ్లు , పండ్లు తింటూ బతుకుతుంటాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వలన పర్యాటక రంగం మొత్తం కుదేలయింది.  దీంతో ఆ ప్రాంతనికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పడిపోయింది. ఇక అక్కడ కోతులకు అరటిపళ్ళు ఇచేవాళ్ళు లేరు. ఆ కోతులు వేరే దారిలేక ఆ థియేటర్ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. రోజు రోజుకి వాటి సంఖ్య పెరిగిపోయింది. అటుగా వెళ్లిన వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి.ఇక ఆ ప్రాంతం కోతుల రాజ్యం అయిపోంది.అది ఆథాయ్‌లాండ్‌లోని లోప్‌బురి నగరం అక్కడ కోతులదే రాజ్యం.కరోనావైరస్ కారణంగా పర్యటకుల రాక ఆగిపోవడంతో వారు ఇచ్చే అరటి, ఇతర పండ్లు వాటికి దొరకడం లేదు.

 

 


ఇక్కడ ఉండే పొడవు తోకల కోతులు ఒకప్పుడు పర్యాటక ఆకర్షణ. కానీ, ఇప్పుడు అక్కడ వాటి ఆధిపత్యం ఎక్కువైపోయింది. వాటికి వేరే ఆహారం లేక అవి జంక్ ఫుడ్ తింటున్నాయి. ఆహారంలో మార్పు రావడంతో వాటిలోనూ మార్పులొస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్కడ ఉండే లోప్‌బురిలోని ఆలయంలో 6 వేల కోతులుంటాయి. అక్కడ ఎవరూ అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎవరైనా అక్కడికి వస్తే అవి వారిపై దాడి చేయడం మొదలుపెట్టాయి.ఇక పాత సినిమా థియేటర్ కూడా వాటికి మరో ఆవాసం. అందులోని ప్రొజెక్టర్ రూమ్ ఆ కోతుల స్మశానం.

 

 

ఏ కోతయినా చనిపోతే మిగతావి ఆ కళేబరాన్ని తీసుకెళ్లి ఆ గదిలో ఉంచుతున్నాయి.ఇప్పుడు ఈ పాత సినిమా థియేటర్‌లోకి కూడా ఎవరినీ రానివ్వడం లేదు. కోతుల సంతానం విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించే పనిలో పడింది. స్థానికులు ఆ కోతులు మాపై దాడులు చేస్తున్నాయని బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: