ఎవరిని ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో, ఏ విధంగా తన దారికి తెచ్చుకోవాలో ఏపీ సీఎం జగన్ కు బాగా తెలుసు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు, ప్రతివ్యూహాలు వేస్తూ, ప్రత్యర్థులను మట్టి కరిపించి ముందుకు వెళ్లగలుగుతున్నారు. ముఖ్యంగా తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని గుక్కతిప్పుకోకుండా చేయడంలో జగన్ పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతూ వస్తున్న కమ్మ సామాజిక వర్గం లో చీలిక తెచ్చే విధంగా జగన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఉంటాయి. ఇప్పుడు ఆ వర్గంలో కూడా చీలిక తెచ్చే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును అతి త్వరలోనే ఖరారు చేసే ఆలోచనలో జగన్ ఉన్నారు.

 

IHG

 

రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయలేనేది జగన్ ఆలోచన. గత ఎన్నికల ముందు కూడా ఈ విషయాన్ని జగన్ చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలో మొత్తం ప్రజాసంక్షేమ విషయాలపైన దృష్టి పెట్టడంతో, జిల్లాల పెంపు అనేది పక్కన పడిపోయింది. ఈ అంశాన్ని జగన్ మళ్లీ తలకి ఎత్తుకున్నారు. కృష్ణా జిల్లాను రెండు జిల్లాలుగా విభజించి ఒకదానికి ఎన్టీఆర్ పేరు పెట్టబోతున్నట్టు అప్పుడు ప్రజాసంకల్పయాత్ర లో భాగంగా గుడివాడలో జగన్ ప్రకటించారు. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని నందమూరి కుటుంబం కూడా స్వాగతించింది.

 

ఇప్పుడు జిల్లాలను పెంచి పేరు మార్చే విషయంలో జగన్ చాలా వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముందుగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించి, ఒక దానికి ఎన్టీఆర్ పేరును, మరొక దానికి పింగళి వెంకయ్య పేరు పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అది జగన్ అమలు చేసి చూపిస్తే కృష్ణ జిల్లాలో రాజకీయ సమీకరణాలు చాలా వరకు మారడంతో పాటు కమ్మ సామజిక వర్గం ఎంతో కొంత జగన్ వైపు టర్న్ అయ్యే ఛాన్స్ లేకపోలు అనేది విశ్లేషకుల అంచన.

 

మరింత సమాచారం తెలుసుకోండి: