వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో, ఏమో తెలియదు గాని, ఆయన వ్యవహారం మాత్రం ఏపీ, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో నిత్యం హాట్ టాఫిక్ గానే మారుతూ వస్తోంది. ఆయన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులను గుర్తించి, వారిని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతా కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్లి మరి రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాల్సింది లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరిన సంగతి తెలిసిందే. అయినా ఆయన ఎక్కడా, అ దూకుడు తగ్గించకపోగా, ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీపైన విమర్శలు చేస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో బయటకు రావడం మరింత కలకలం రేపింది.


 ఇదిలా ఉంటే ఆయన నిన్ననే  ఢిల్లీకి వెళ్లి చేయాల్సిన హడావుడి అంతా చేసినట్టుగా కనిపిస్తున్నారు. గతంలోనే తన ప్రాణాలకు ముప్పు ఉందని, సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై కక్ష కట్టారని, ఈ నేపథ్యంలో తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేసి అప్పుడే 20 రోజులు దాటిపోవడంతో, తన భద్రత విషయమై ఢిల్లీ హోం శాఖ కార్యదర్శిని కలిసినట్లు ఎంపీ చెబుతున్నారు. .తనకు భద్రత కల్పించే విషయంపై మరోసారి గుర్తు చేసినట్లు చెప్పారు. సాధారణంగా ఎంపీలు భద్రత విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది.


 కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత  ఇస్తామని చెప్పినా, పట్టించుకోకుండా,  కేంద్ర బలగాల భద్రత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తనపై లోక్ సభ స్పీకర్ కు సమర్పించిన అనర్హత పిటిషన్ రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూనే... నా అనర్హత పిటిషన్ అనర్హం అయిపోతుందని చెప్పుకొచ్చారు. ఆయన వ్యవహారం చూస్తే బీజేపీ ఆయనకు అనర్గత వేటు పడకుండా కాపాడుతాను అనే అభయం ఇచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చినా, ఇప్పుడు ఆ పార్టీనే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజుగారి అడుగులు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: