ప్రేమ మాటల్లో చెప్పలేని ఓ మధురానుభూతి... ఎన్నో తీపి జ్ఞాపకాల సమ్మేళనం  ప్రేమ... ఇద్దరి మనుషుల కలయికే ఈ ప్రేమ.. ఇలా ప్రేమ గురించి వర్ణించడానికి ఎంతగొప్పగా చెప్పిన  ప్రేమ మధురానుభూతి ముందు ఆ పదాలు సరిపోవు. ఎప్పుడు ఎవరితో ఎందుకు ప్రేమలో పడతామో మనకే తెలియదు... ఇలాంటి ప్రేమ నేటి రోజుల్లో మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. పైపై ప్రేమలు  నటిస్తూ మాయ మాటలు చెబుతూ యువతులను మోసం చేస్తున్న ఘటనలే ఎక్కువగా వెలుగులోకి  వస్తున్నాయి. ప్రేమ ముసుగులో మాయమాటలు చెబుతున్న వారి బారిన పడి ఎంతో మంది మహిళలు అయోమయంలో పడుతున్న  ఘటనలు ప్రతిరోజు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. కొంతమంది ప్రేమను గెలిపించుకోవడానికి ప్రాణాలను సైతం వదులుతుంటే మరికొంతమంది.. ప్రేమ అనే ముసుగు వేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... రైలులో  ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ వరకు దారి తీసింది.



కానీ ఆ యువతి ఆ వ్యక్తి యొక్క దుర్బుద్ధి గ్రహించలేక పోయింది. ప్రేమ పేరుతో ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇక సదరు యువతిపై కామవాంఛను తీర్చుకున్నాడు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేసి ఆ యువతి జీవితాన్ని అయోమయంలో పడేసాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ యువతి... పోలీసులని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతాలపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక ఇటీవలే నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. ఈ క్రమంలోనే హైదరాబాదుకు రైలు లో వచ్చే క్రమంలో.. తోటి ప్రయాణికుడు అయిన మణుగూరు కు చెందిన సింగరేణి ఉద్యోగి వివేకానంద తో పరిచయం ఏర్పడింది.



ఆ తర్వాత ఒకరితో ఒకరు చరవాణి ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన వివేకానంద యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతిపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇలా ఐదు నెలల సమయం గడిచిన తరువాత పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తీసుకురావడంతో మొహం చాటేశాడు వివేకానంద. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక  నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: