క‌రోనా ప్ర‌పంచంలో కొన్ని కోట్ల మంది జీవితాల‌ను అతలాకుత‌లం చేసింది. ఎన్నో వ్య‌వ‌స్థ‌లు నాశ‌నం అయ్యాయి. ఎంతో మంది త‌ల‌రాత మారిపోయింది. ఓడ‌లు బ‌ళ్లు అయిపోయాయి. చాలా మందికి ప్ర‌పంచ వ్యాప్తంగా చేయ‌డానికి ప‌ని.. తిన‌డానికి తిండి కూడా లేకుండా పోయింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 15,107,950 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 619,817 కరోనా మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారు 9,128,357 మంది ఉన్నారు. 

 

ఇక క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వేల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే కరోనా రోగుల జీవితాల్లో ఆశలు రేకెత్తించిన ఆక్స్‌ఫర్డ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి వస్తుందన్న ఆశ‌లు తాజాగా ఆవిరి అయిపోయాయి. ఈ వ్యాక్సిన్ పై ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆశ‌లు పెట్టుకున్నారు. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సినాలజిస్టు సారా గిల్బర్ట్ ఈ అంశంపై మాట్లాడుతూ వ్యాక్సిన్ రావ‌డానికి వ‌చ్చే యేడాది టైం ప‌డుతుంద‌ని.. దీనిపై ప్ర‌యోగాలు ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయ‌ని చెప్పారు. 

 

తొలి ద‌శ‌లో ప్ర‌యోగం విజ‌య‌వంతం అయిన‌ట్టు ఆక్స్‌ఫ‌ర్ట్ వ‌ర్సిటీ ప్ర‌క‌టించినా ఈ యేడాది చివ‌రి నాటికి దీనిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌న్న ల‌క్ష్యం ఉన్నా అది సాధ్యం అవుతుంద‌న్న‌ది మాత్రం క‌రెక్టుగా చెప్ప‌లేమ‌ని కూడా గిల్బ‌ర్ట్ చెప్పారు. ఇప్పుడు ఆమె చేసిన ప్ర‌క‌ట‌నే ఎంతో మంది గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోంది. ఈ యేడాది చివ‌రి నాటికి కూడా క‌రోనా వ్యాక్సిన్ రాని ప‌క్షంలో ప్ర‌పంచంలో మ‌ర‌ణాల సంఖ్య ఊహించ‌డానికే భ‌యంగా ఉంద‌ని నిపుణులు చెపుతున్నారు. ఈ వ్యాక్సిన్‌పై ఎన్నో ఆశ‌ల‌తో ఉన్న వారు సైతం గిల్బ‌ర్ట్ ప్ర‌క‌ట‌న‌తో తీవ్ర నిరాశ‌లోకి వెళ్లిపోయారు.

 

మ‌రో వైపు చివరిదశ ప్రయోగాలు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని విశ్లేషించాల్సి ఉంది. ఇక ఈ వ్యాక్సిన్ పూర్త‌య్యాక వీటిని కొన్ని వేల మందిపై ప్ర‌యోగించి మూడో ద‌శ‌లో కూడా విజ‌య‌వంతం అయ్యింద‌న్న నిర్దార‌ణ వచ్చాకే ఇది స‌క్సెస్ అయిన‌ట్టు భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: