ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి లక్షల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అయితే చాలా వైరస్ లను సులభంగా ఎదుర్కొనే మానవ రోగనిరోధక వ్యవస్థ కరోనా వైరస్ ను మాత్రం ఎదుర్కోలేకపోతూ ఉండటానికి అసలు కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
అమెరికా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ మానవ రోగనిరోధక శక్తిని బోల్తా కొట్టిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఈ వైరస్ జన్యుక్రమం మనుషుల శరీరంలో అంతర్భాగమే అనేలా రోగనిరోధక వ్యవస్థను ఎక ఎంజైమ్ భ్రమింపజేస్తుందని గుర్తించారు. అందువల్లే రోగ నిరోధక వ్యవస్థ వైరస్ శరీరంలోకి ప్రవేశించినా కట్టడి చేయలేకపోతుంది. వైరస్ ఎం.ఆ.ఎన్.ఏ మానవుల ఎం.ఆర్.ఎన్.ఏలను పోలి ఉండటంతో మనుషుల రోగనిరోధక వ్యవస్థ వైరస్ ను రక్షిస్తున్నట్టు తేలింది.
మన రోగ నిరోధక వ్యవస్థ వైరస్ కణాన్ని మానవ కణమే అని గుర్తించడంతో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎన్.ఎస్.పీ అనే ప్రోటీన్ వల్ల మానవ శరీరం వైరస్ పరాయిది కాదని విశ్వసిస్తోంది. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు సరికొత్త ఔషధాల రూపకల్పన జరుగుతోంది. మానవ శరీరం కరోనాను సొంత కణంగా గుర్తించి ఉంటే ఈ స్థాయిలో వైరస్ విజృంభణ జరిగేది కాదు.
మరోవైపు గత 24 గంటల్లో దాదాపు 50,000 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49,931 మందికి కరోనా నిర్ధారణ కాగా 708 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరింది. నిన్న ఒక్కరోజే 31,991 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో 4,85,114 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి