ఏపీలో కరోనా వైరస్ విలయతాడవం చేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతుంది కానీ తరగడం లేదు. ఈ వైరస్ కారణంగా చాల మంది వారి ప్రాణాలను కోల్పోయారు. అంతే కాకుండా చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికీ ఆహారంలో పలు మార్పులు తీసుకొచ్చారు. అంతేకాకుండా వారి పెట్టె ఆహారంలో స్వల్ప మార్పులు తీసుకొచ్చినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అయితే ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్న సంగతి అందరికి తెలిసందే. అంతేకాకుండా బుధవారం రికార్డు స్థాయిలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయినా సంగతి కూడా తెలిసిందే. అయితే ఏపీలో టెస్టుల సంఖ్య ప్రభుత్వం పెంచడంతో.. కేసులు కూడా బయటపడుతున్నాయని నిపుణులు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి జగన్ కూడా కరోనా రోగులకు అరగంటలోనే బెడ్లు కేటాయించాలని తేల్చి చెప్పేశారు.


కరోనా నివారణపై జిల్లా కలెక్టర్లు, జేసీలకే ఆ బాధ్యత అప్పగించారు. అంతేకాకుండా ఇక ఐసోలేషన్ సెంటర్లలో ఉండేవారికి ఎలా ఆహారంపై తరచూ విమర్శలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. అయితే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఏపీలో కరోనా రోగులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

అయితే గతంలో ఉన్న మెనూలో ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అయితే వారి కోసం స్పెషల్ మెనూను సిద్ధం చేసిందని తెలిపారు. కరోనా రోగులు ప్రతిరోజూ ఉదయం రాగిజావ, బెల్లం, పాలను అందిస్తుండగా.. రోజుకో టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో వివిధ వెరైటీలను అందిస్తోందని తెలియజేశారు. ఇంకా వైద్యుల సూచనలతో మెనూలో మార్పులు చేసిందని నిపుణులు తెలిపారు. సోమవారం నుంచి ఆదివారం వరకు వారం పాటూ మెనూలో మార్పులు చేసిందన్నారు. అంతేకాకుండా ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనం మెనూ వివరాలను సోషల్ మీడియాలో సందేశం పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: