ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు ఎంతో ఆదరణ కలిగి టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టిక్ టాక్  కి ప్రస్తుతం వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. చైనా- భారత సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల దృశ్య... కీలక సమాచారం తస్కరణ కు గురయ్యే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ సహా చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను  భారత్ లో  నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో  టిక్ టాక్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఇక ఆ తర్వాత మిగతా దేశాలు కూడా టిక్ టాక్ ని బ్యాంక్  చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో టిక్  టాక్  అసలు ఇతర దేశాల్లో అయిన పని చేస్తుందా  అనే అనుమానం నెలకొంది. ఇక ఇటీవలే అమెరికా కూడా తమ దేశంలో టిక్ టాక్  ను పూర్తి స్థాయిలో నిషేధించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.


 దీనికి సంబంధించిన బిల్లు కూడా అమెరికాలోని ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది.. ఇంకొన్ని రోజుల్లో టిక్ టాక్ నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే భారత్ లో  ఉన్న కస్టమర్లను కోల్పోయి 40 శాతం వరకు నష్టపోయింది టిక్ టాక్. ఒకవేళ అమెరికాలో కూడా నిషేదానికి గురయితే 70 శాతం వరకు నష్టాల  పాలు అయ్యే అవకాశం ఉంది. దీంతో టిక్ టాక్ ను  నిర్వహించడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక బేరసారాలకు దిగుతుంది ప్రస్తుతం టిక్ టాక్. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైక్ డాన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


 అయితే టిక్ టాక్ ను   మైక్రోసాఫ్ట్ కి  అమ్మెందుకు  ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇండియాలో కూడా జియో  టిక్ టాక్ ని కొనేందుకు  సిద్ధంగా ఉంది  అంటూ టాక్  వినిపిస్తోంది. లేదా  గూగుల్  టిక్ టాక్ కొనే ఆలోచనలో ఉందట . అయితే ఒకవేళ చైనా కు సంబంధించిన బైట్ డాన్స్ చేతిలోంచి..  మిగతా కంపెనీల  చేతిలోకి టిక్ టాక్  వెళ్తే... నిషేధానికి గురైన టిక్ టాక్  ప్రస్తుతం మళ్లీ భారత్ లోకి వచ్చేందుకు అవకాశం కూడా లేకపోలేదు. ఇది టిక్ టాక్ యూసర్స్ కి   శుభవార్తే అని చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: