ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అభం శుభం తెలియని ఆరేళ్ల పసిపాపని అపహరించి ఆపై అత్యాచారం చేసి.. ఆమె ప్రైవేటు పార్టుని కూడా అతి కిరాతకంగా గాయపరచి పరారయ్యాడు ఒక నీచుడు. ఆగస్టు 6 తేదీన సాయంత్రం పూట హపూర్ లోని గర్హ్ ముక్తేశ్వర్ కొత్వాలి ప్రాంతంలో తన ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ద్విచక్ర వాహనం పై వచ్చిన ఒక దుండగుడు ఆమెను కిడ్నాప్ చేసి ఆపై ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాలను తీవ్రంగా గాయపరచి గ్రామానికి సమీపంలోని పొలంలో పడవేసి అక్కడి నుంచి పారిపోయాడు.


అయితే కనిపించకుండాపోయిన బాలిక కోసం కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు. కానీ బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో కొత్వాలి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి తమ బాలికని ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెదకడం ప్రారంభించారు. చాలా గంటల పాటు వెతికిన పోలీసులకు ఆగస్టు 7వ తేదీన ఉదయం ఒక పొలంలో బాలిక అపస్మారక స్థితిలో కనిపించగా...  కుటుంబీకులకు, తల్లిదండ్రులకు బాలిక ఆచూకీ లభ్యం అయ్యిందని సమాచారం అందించారు పోలీసులు.


కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్న తమకుమార్తె ను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆపై హపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికకు బాగా గాయాలు కావడంతో శస్త్రచికిత్సలు అవసరం కాబట్టి ఆమెను మీరట్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు పోలీసులు. ఐతే మీరట్ ఆసుపత్రి వైద్యులు ఆరేళ్ల బాలికని పరిశీలించి బాలికపై అత్యాచారం జరిగిందని... ప్రైవేట్ భాగాలు బాగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.


మరోవైపు నిందితుడు పొలంలో ఎక్కడైనా దొరుకుతాడేమోనని ఐదారు గంటల పాటు గ్రామస్తులు వెతికారు కానీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కూడా 8 బృందాలుగా ఏర్పడి గత 36 గంటలు గా నిందితుడి కోసం గాలిస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనపై హాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ... 'బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరం. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాలిక ప్రస్తుతం మీరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది', అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: