అయితే రష్యా వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా పెద్దగా ఉపయోగం లేదని కామెంట్లు చేస్తున్నారు. చాలా తక్కువ మందిపై రష్యా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారని అందువల్ల వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా వ్యాక్సిన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ను ఉపయోగించేముందు వ్యాక్సిన్ సురక్షితమైనదో కాదో మరోమారు పరిశీలిస్తే మంచిదని చెప్పారు. శాంపిల్ పరిణామం, సామర్థ్యాన్ని బట్టి వ్యాక్సిన్ భద్రతను అంచనా వేయవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ నుంచి ఉత్పత్తి అయిన యాంటీబాడీలు ఎంతకాలం వైరస్ సోకకుండా రక్షిస్తాయో ప్రాథమికంగా పరిశీలించాలన్నారు.
భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చెసేముందు వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందా...? లేదా...? లాంటి అంశాలను పరిశీలించాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా విమర్శలే రష్యా వ్యాక్సిన్ విషయంలో వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రష్యా ప్రపంచ దేశాల ప్రశ్నల పట్ల ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ వ్యాక్సిన్ గురించి అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. రష్యా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకకపోతే మాత్రమే ఈ వ్యాక్సిన్ సక్సెస్ అయినట్లు చెప్పవచ్చు. మరోవైపు రష్యా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇతర వ్యాక్సిన్లు కూడా వీలైనంత తక్కువ సమయంలో మార్కెట్లో విడుదల అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి