స్వర్ణపాలెస్ హోటల్ అగ్ని ప్రమాదం కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని తనకు న్యాయ సలహాదారులు చెప్పారని రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు చెబుతున్నట్టు తెలుస్తోంది. వైద్యానికి కులం, మతం ఉండదని.. కానీ.. కొందరు ప్రజాప్రతినిధులు రమేష్ చౌదరి అంటూ మీడియాలో మాట్లాడుతున్నారని... వైద్యం అనేది కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు, వ్యాపారం అభివృద్ది చేయడం కాదని ఆయన కామెంట్ చేసినట్టు తెలిసింది. విజయవాడలో స్వర్ణ పాలస్ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణానికి బాధ్యులన్న కారణంతో రమేష్ హాస్పిటల్ కు అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు.
విజయవాడ ఎంజీ రోడ్‌లోని డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందినట్లు అధికారులు గుర్తించారు.కోవిడ్ సెంటర్ ఏర్పాటులో ముందు జాగ్రత్త తీసుకోలేదని ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారుల విచారణలో తేలింది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు.
అయితే రమేశ్ మాత్రం.. జిల్లా కలెక్టర్ అనుమతితోనే హోటల్ లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్ మెంట్ నిర్వహణ బాధ్యత హోటల్‌దేనని రమేశ్ చెప్పినట్టు తెలుస్తోంది. పేషెంట్ మెడికల్ సర్వీసెస్ రమేష్ హాస్పిటల్ బాధ్యత అని ఆయన తెలిపారు. అంతే కాదు.. హోటల్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి నైట్ డ్యూటీలో ఉన్నవారిని అరెస్ట్ చేయకుండా... ఆస్పత్రి సిబ్బందిని అవసరమైనప్పుడు విచారణకు పిలవకుండా.. ఎందుకు రిమాండ్‌కు పంపారని రమేశ్ బాబు ప్రశ్నించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి