మిల్కూరి గంగవ్వ.. ఇప్పుడు యూట్యూబ్ చూసేవాళ్లకు ఈ పేరు చాలా పరిచితమైందే.. 65-70 ఏళ్ల వయస్సులో గంగవ్వ అనుకోకుండా యూట్యూబ్ స్టార్ అయ్యింది. మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా పరిచయమైన గంగవ్వకు ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా వస్తున్నాయి.. అలాంటి గంగవ్వ సక్సస్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో పాపులర్ గా మారుతోంది.


గంగవ్వపై ఇప్పటికే అనేక మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు చేశాయి. ఇప్పుడు గంగవ్వ కీర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుతోంది. తాజాగా CNN వార్తా సంస్థ ఆమె జీవిత ప్రస్థానంపై ఓ వీడియో రూపొందించింది. గంగవ్వ ఓ సాధారణ వృద్ధురాలు. అక్షర జ్ఞానం లేని గంగవ్వ అలవోకగా నటిస్తుంది.. అత్యంత సహజంగా ఉండే ఆమె ఆహార్యం, వాచకం ఆమెను యూట్యూబ్ స్టార్‌ ను చేశాయి.



మై విలేజ్ షో నిర్వహించే వారిలో ఒకరైన శ్రీకాంత్ ఆమె అల్లుడు. షార్ట్ ఫిల్ములు, యూట్యూబ్ వీడియోలు రూపొందించే శ్రీకాంత్.. తన అత్తగారిలోని టాలెంట్‌ను గుర్తించాడు. అలా ఆమె తన అల్లుడి వీడియోల ద్వారానే ప్రపంచాన్ని జయించింది. ఇప్పుడు ఆమె కీర్తి పతాకం విశ్వవీధుల్లో రెప రెపలాడుతోంది.



యూట్యూబ్ వీడియోలు చేయక ముందు.. గంగవ్వ కూలీ పనులు చేసుకుంటూ ఉండేది. ఆమె ఏనాడు పెద్దగా ఊరు దాటి బయటికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు  ‘మై విలేజ్ షో’ ద్వారా ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తెలంగాణ పల్లె సంస్కృతికి ఆమె ఓ ప్రతిరూపం. ఆమె తన అమాయకత్వంతో.. అచ్చ తెలంగాణ యాసతో జనాన్ని ఆకట్టుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: