భారత ప్రభుత్వం 118 చైనా దేశానికి సంబంధించిన అప్లికేషన్లను గేమ్లను నిషేధించింది, బుధవారం నాడు ప‌బ్జీ గేమ్ ని కూడా డిలీట్ చేస్తున్నామని ప్రకటించగానే ఒక్కసారిగా భారతదేశంలో జోరుగా ప్రచారం జరిగింది. కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ బుధవారం రోజున 118 చైనీస్ ఆధారిత గేములను అప్లికేషన్లను బ్యాన్ చేస్తున్నామని జాబితాను కూడా విడుదల చేసింది. అయితే నిషేధిత జాబితాలో పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ కూడా ఉండటం విశేషం. టెన్ సెంట్ గేమ్స్ కంపెనీ పబ్జి మొబైల్ ని డెవలప్ చేయడం వలన దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది అని తెలుస్తోంది.


అయితే బ్యాన్ చేశామని ప్రకటించిన రెండు రోజుల తర్వాత కూడా పబ్జి మొబైల్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. దీంతో పబ్జి మొబైల్ బ్యాన్ అవుతుందా లేదా అని చాలామందిలో అనుమానాలు రేకెత్తాయి. కాస్త లేట్ అయినా పబ్జి మొబైల్ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆపిల్ స్టోర్ నుండి తొలగించబడుతుందని అందరూ అనుకున్నారు. కొందరు మాత్రం ఇంకా పబ్జి మొబైల్ తొలగించబడ లేదని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఐటీ మంత్రిత్వ శాఖ గూగుల్ ప్లే స్టోర్ నుండి పబ్జి మొబైల్ ని తొలగించాలని కోరింది. భారత కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి వరకు గూగుల్ పబ్జి మొబైల్ ని తమ ప్లే స్టోర్ నుండి తొలగించింది. యాపిల్ స్టోర్ కూడా పబ్జి మొబైల్ గేమ్ ని తొలగించింది.


పబ్జి మొబైల్ లో ఇంటర్నెట్ సర్వర్లు భారతీయుల సమాచారాన్ని వేరొక దేశానికి సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు కేంద్ర ప్రభుత్వం పబ్జి పై కొరడా ఝళిపించింది. పబ్జి మాదిరి లాగానే ఉండే సైబర్ హంటర్ గేమ్ కూడా చైనా దేశానికి సంబంధించినదే. అందుకే ఆ గేమ్ ని కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించారు. విద్యార్థులు చదువుకోకుండా పబ్జి మొబైల్ గంటలతరబడి ఆడుతుండడంతో గతంలో వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చాలామంది పబ్జి గేమ్ ఆడి మానసికంగా బలహీనంగా తయారైతే మరికొందరు ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు. చైనా దేశం పై శత్రుత్వం తోపాటు యువత యొక్క బ్రహ్మాండమైన భవిష్యత్తును పబ్జి మొబైల్ సర్వ నాశనం చేస్తుందన్న కారణంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: