"సమర్థవంతమైన విస్తృత-స్థాయి పరీక్షల ద్వారా కరోనా పాజిటివ్ రోగులను ముందస్తుగా గుర్తించడం... వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించడం... తక్కువ వ్యాధి తీవ్రత ఉన్న వారిని ఇల్లులో వేరువేరుగా ఉండమని చెప్పడం... కరోనా బాధితులకు అన్ని సౌకర్యాలను సమకూర్చడం... వంటి వాటితో పాటు ఐసియులో చికిత్స అందించే డాక్టర్ల యొక్క మెరుగైన క్లినికల్ నైపుణ్యాలు కరోనా అధిక రికవరీ రేటు (సిక్) కు దారితీశాయి" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు భారతదేశంలో 44.65 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్యలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న దేశం గా ఇండియా లో ఇప్పటివరకు 75,062 కరోనా బారిన పడిన ప్రజలు మృతి చెందారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనభై లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారని నివేదికల ప్రకారం తెలుస్తోంది. అమెరికా లో ఇప్పటివరకు 63 లక్షల 95 వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక లక్షా 91 వేల మంది కొవిడ్ -19 వ్యాధితో బాధపడుతూ మరణించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి