నెక్స్ట్ ఎన్నికల్లో సైతం ఇక్కడ నాని గెలుపుని ఆపడం కష్టమని తెలుస్తోంది. అయితే అందరివాడిగా ఉండటం వల్లే గుడివాడలో నాని గెలుపు సులువుగా వస్తుంది. గుడివాడ నియోజకవర్గంలో ప్రతి సామాజికవర్గం నానికే మద్ధతు ఇస్తుంటుంది. నాని కూడా అందరినీ సమానంగా చూస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, కమ్మ, కాపు వర్గాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వర్గాలు కూడా నానికి ఫుల్ మద్ధతు ఇస్తుంటారు. విచిత్రం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇక్కడవారు నానికి ఓటు వేస్తుంటారు. ఒకవేళ ఎంపీ ఓటు వేరే పార్టీకి వేసినా కూడా, ఎమ్మెల్యే ఓటు నానికే పడుతుంది. ఇంతలా ప్రతివర్గం నానికి మద్ధతు ఇస్తుంటుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో కీలకంగా ఉన్న రెడ్డి వర్గం చాలా తక్కువగా ఉంటారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాదు.
కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో రెడ్డి వర్గానికి ప్రాధాన్యత పెరిగింది. తాజాగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కొండాలమ్మ గుడి ఛైర్మన్ పదవి కనుమూరి రామిరెడ్డికి దక్కింది. రామిరెడ్డి వైసీపీలో కీలకంగా పనిచేస్తూ ఉంటారు. నానికి సపోర్ట్‌గా ఉంటారు. నియోజకవర్గంలో కీలక పదవులు ఇతర వర్గాలకు ఇవ్వడం, ఏ పనైనా సమర్ధవంతంగా చేస్తారనే ఉద్దేశంతో రెడ్డి వర్గానికి చెందిన రామిరెడ్డికి కొండాలమ్మ గుడి ఛైర్మన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే గుడివాడలో రెడ్డి వర్గానికి కూడా ప్రాధాన్యత దక్కింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి