పాకిస్తాన్ ఎప్పుడూ నీచాతి నీచా  లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఓ వైపు నీచమైన ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాదు... మరోవైపు చైనా కు బానిస గా వ్యవహరిస్తూ ఆ దేశ ప్రజల ప్రయోజనాలను కూడా తాకట్టు పెడుతు నీచానికి  ఒడిగట్టింది  పాకిస్థాన్ . అయితే ఈ మధ్య కాలంలో ఓ మహిళ అత్యాచారం కేసు  పాకిస్తాన్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఈ అత్యాచారం తర్వాత పాకిస్తాన్ లో  జరుగుతున్న దారుణాలను ఒక్కొక్కటిగా బయటపెడితూ  సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ లో  ఎంతటి దారిన ఘటనలు జరిగాయి అనే విషయాలను ఇప్పటికే ఎంతో మంది జర్నలిస్టులు తెరమీదకు తీసుకువచ్చారు.




 ఇటీవలే పాకిస్తాన్ లో  రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలకు మూలకారణాలను పరిష్కరించాలంటూ ఇటీవలే ఓ సంఘం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే మహిళా  సంఘం అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ లో అసలు అత్యాచారాలు జరగడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని బయటపెట్టారు ఆ సంఘం నాయకురాలు. అయితే పాకిస్తాన్ లో  రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయని... అసలు మహిళలకు ఎక్కడా రక్షణ అనేది లేకుండా పోయింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ నీచమైనటువంటి విషయం ఏమిటి అంటే మహిళలపై అత్యాచారం చేస్తుంది ఎవరు కాదు ఏకంగా సొంతవారే  అన్న విషయం కూడా బయటపెట్టింది సదరు మహిళ.




 వివిధ కేసుల ఆధారంగా సేకరించిన వివరాల ప్రకారం అత్యాచార నిందితుల్లో 82 శాతానికి పైగా కుటుంబ సభ్యుల కారణమవుతున్నారు అంటూ సదరు మహిళ తెలిపారు. ఇలా అన్న, తమ్ముడు, తండ్రి వరుసల వారే  దారుణంగా మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రోజురోజుకీ పాకిస్థాన్ లో మహిళలకు సొంతింటి వారి నుంచి కూడా రక్షణ కరువైంది అన్న విషయాన్ని తెలిపింది. అత్యాచారం నుంచి బయటపడిన ఎంతోమంది మహిళలు న్యాయం చేయాలంటూ తమను ఆశ్రయించారు అంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ఆ మహిళ సంఘం నాయకులను. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: