ట్రాన్స్ జెండర్ కార్యకర్త రంజిత సిన్హా ఇతర ఇద్దరు హిజ్రాల తో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వారిని ఆపి అసభ్యంగా ప్రవర్తించాడు అభిషేక్ భట్టాచార్జీ. మమ్మల్ని దయచేసి వెళ్లనివ్వండి, సార్ అని ఎంత ప్రాధేయపడినా అతను మాత్రం వినిపించుకోకుండా వారిని తీవ్రంగా వేధించాడు. దాంతో చేసేదేమీ లేక ట్రాన్స్ జెండర్ కార్యకర్త 100 కి ఫోన్ చేసి తమని కాపాడవలసిందిగా కోరారు. వెంటనే స్పందించిన ఆమె కోల్కతా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అభిషేక్ భట్టాచార్జీ ని అదుపులోకి తీసుకొని పలు కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్ 341, 344, 509 సెక్షన్ల కింద అరెస్ట్ చేశామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
ట్రాన్స్ జెండర్ కార్యకర్త రంజిత సిన్హా మీడియాతో మాట్లాడుతూ... 'ఒక పోలీసు అధికారి అయి ఉండి మాలాంటి ట్రాన్స్ జెండర్లను కూడా వదలడం లేదు. ఇక ఇటువంటి నుంచి లో అమ్మాయిలు కనిపిస్తే వదులుతారా? ఇటువంటి మగాళ్లను విధుల నుంచి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలి,' అని ఆమె డిమాండ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి