ప్రస్తుతం ఎన్నో రకాల బ్యాంకు లు తమ తమ కస్టమర్లకు ఎన్నో వినూత్నమైన సేవలు అందుబాటు లో ఉంచుతున్న  విషయం తెలిసిందే. మార్కెట్లో ఉన్న ఇతర బ్యాంకుల పోటీని తట్టుకుంటూ తమ తమ కస్టమర్ల ను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు తమ సేవలను మెరుగు పరుచుకుంటూ నే  ఉంటాయి వివిధ బ్యాంకులు. అంతేకాదు తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా వివిధ రకాల స్కీమ్ లను కూడా అందుబాటు లో ఉంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఫెడరల్ బ్యాంక్ తమ కస్టమర్లకు సేవలు అందించేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.




 అంతేకాకుండా తమ కస్టమర్ల కు మేలు జరిగే విధంగా పలురకాల స్కీమ్ లను కూడా  అందుబాటు లో ఉంచుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల తమ కస్టమర్లు అందరికీ మరో బంపర్ ఆఫర్ అందుబాటు లోకి తీసుకు వచ్చింది. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే ఫెడరల్ బ్యాంకు కస్టమర్ల కు ప్రస్తుతం అందుబాటు లోకి వచ్చిన ఈ కొత్త ఆఫర్ తో ఎంతగా నో మేలు చేకూరే అవకాశం ఉంది. మామూలుగా ఇన్స్టాల్మెంట్ లో ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలంటే ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫెడరల్  బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త ఆఫర్ ప్రకారం ఎలాంటి డౌన్ పేమెంట్ అవసరం లేదు.



 ఎందుకంటే ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన ఆఫర్ ప్రకారం.. బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డుతో ఒక రూపాయి చెల్లించి... బైక్   కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.  హీరో, హోండా, టీవీఎస్ షో రూమ్ లో ఈ ఆఫర్ వర్తిస్తుంది . ఇక ఆ తర్వాత సంవత్సరం లోపు మిగతా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంకు తీసుకువచ్చిన ఈ సరికొత్త ఆఫర్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కష్టమర్లందరికీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: