మొన్నటి వరకు ఏపీ బిజెపి అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ హవా ఇక బీజేపీ లో ముగిసినట్లుగానే ఇప్పటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడయితే ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో సోము వీర్రాజు ని నియమించారో అప్పటి నుంచి ఏపీ బీజేపీలో కన్నా చాలా సైలెంట్ అయిపోయారు. పెద్దగా ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు. అంతకు ముందు అమరావతి వ్యవహారంతో పాటు మరి కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కన్నా గట్టిగానే గొంతు ఎత్తి మాట్లాడేవారు. ఆయన  టిడిపికి మద్దతుగా నిలిచినట్టుగా వ్యవహరించేవారు. పెద్దగా యాక్టివ్ గా ఉండడం కానీ, పార్టీలో చేరికల విషయంలో కానీ, ఎందులోనూ ఆయన ముద్ర వేయలేకపోయారు. అయితే సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత పూర్తిగా ఆ సాంప్రదాయాన్ని తుడిచి వేశారు.


పార్టీకి వీర విధేయుడిగా ఉంటూనే, పార్టీని ధిక్కరించిన వారిపై వేటు వేస్తూ, పార్టీలో హీటు పుట్టిస్తున్నారు. అప్పట్లో కన్నా మద్దతిచ్చిన అమరావతి వ్యవహారానికి సోము వీర్రాజు పులిస్టాప్ పెట్టేసారు. తాము రాజధాని విషయంలో కలుగజేసుకోమని చెబుతూనే పూర్తిగా అధికార పార్టీ కి మద్దతు ఇచ్చినట్టుగా వ్యవహరించినట్టుగా ప్రవర్తించేవారు. మూడు రాజధానులు కాదు ఎన్ని పెట్టుకున్నా తమకు ఏమీ అభ్యంతరం లేదని తేల్చి చెప్పేశారు. అలాగే అమరావతి వ్యవహారంపై హడావుడి చేసిన కొంతమంది నేతలను వీర్రాజు సస్పెండ్ సైతం చేసారు.


ఇక కన్నాను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన సమయంలో ఆయన కాస్త అసంతృప్తికి గురి కాగా, త్వరలో జాతీయస్థాయి పదవిలోకి తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరిగినా ఆ సమయంలోనే బిజెపి జాతీయ నాయకుడు రామ్ మాధవ్ స్పందించి కన్నా కు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పడంతో, ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ కొత్తగా ప్రకటించిన జాతీయ కమిటీలో దగ్గుబాటి పురంధరేశ్వరిని జాతీయ కార్యదర్శిగా నియమించారు. కానీ లక్ష్మీనారాయణను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర కార్యవర్గం నుంచి కూడా తప్పించడం, ఇప్పుడు జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో కన్నా ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: