కొన్ని ముఠాలు అయితే ఏకంగా తమ దగ్గర ఉందని జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఇలా చేస్తూ మోసాలకు దిగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిపై బాగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు చిత్తూరు దాకా వచ్చేసింది. తిరుపతిని కూడా కదిలిస్తోంది. ఎర్రని పాదరసంని 20, 30 ఏళ్ల కిందటి టీవీలు, రేడియోల్లో ఉపయోగించేవారు. ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగిపోయింది. కరోనా చికిత్సకు వాడతారని మరికొందరు తప్పుడు ప్రచారం సాగుతోంది.
ఇలా దీనికి డిమాండ్ రావడంతో తెగ ఆరాట పడిపోతున్నారు. కొందరేమో పాత టీవీలు, రేడియాలు కావాలంటూ యాడ్స్ ఇస్తున్నారు. ఇలా అంత దీని మాయలో పడిపోయారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి ప్రాంతాల్లో పలు ముఠాలు సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాణ్యత ఉన్నదైతే బంగారాన్ని పక్కన ఉంచితే.. అయస్కాంతంలా ఆకర్షించాలట. కొందరు మాత్రం దీనిలో కూడా మోసాలు చెయ్యడానికి తయారయ్యారు. ఎర్రటి ద్రవాన్ని గాజు గొట్టాల్లో నింపి.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఈ మోసాల బారిన పడకూడదని పోలీసులు హెచ్చరించడం జరిగింది.గతంలో ఈ తరహాలో జరిగాయని ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి