ఏపీలో అన్ని రంగాల వారికి చేయూత నివ్వడం లో ముందుండి  ప్రఖ్యాతిగాంచింది జగన్ సర్కారు..... ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్తను అందించి మరో ముందడుగు వేసింది... వారి నైపుణ్యాలకు ఇంకాస్త పదును పెట్టి మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి వారికి ఈ అవకాశాన్ని కల్పించింది.. ఏపీలో ఇంజనీరింగ్ విద్యార్థులకు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు స్వయంగా వారే కల్పించేందుకు ప్రముఖ శిక్షణా సంస్థ ఎక్స్ ఎల్ ఆర్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది... ఈమేరకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో ఎపిఎస్ ఎస్ డీసీ సీజీఎం టెక్నికల్ డాక్టర్ గుజ్జుల రవి ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది.

ఈ డీల్ ప్రకారం ఎక్స్ ఎల్ ఆర్ సంస్థ డేటా అనాలసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బిగ్ డేటా లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు  శిక్షణ ఇవ్వనున్నారు. అయితే వీరితో పాటు  అధ్యాపకులకు కూడా ఈ సంస్థ  అవకాశం కల్పించడం విశేషంగా ఆకట్టుకుంటుంది. రానున్న రోజుల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్న మరిన్ని కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఎపిఎస్ ఎస్ డిసి ఎండి సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటిరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే అవకాశం ఎపిఎస్ఎస్డిసితో ఇలా భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని.... ఎక్స్ఎల్ఆర్ సంస్థ సీఈవో రామ్ తవ్వ వ్యక్తపరిచారు. ఇప్పటికే ఎపిఎస్ ఎస్ డిసి - ఎక్స్ ఎల్ ఆర్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లోని 2500 మంది అధ్యాపకులకు డేటా సైన్స్ పై నెలరోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి మరియు ఇంజనీరింగ్ &ఎంటెక్ చివరి సంవత్సరం చదువుతున్న 3272 మంది విద్యార్థులకు 40రోజల పాటు డేటా అనలిటిక్స్ పై ఆన్ లైన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పించి ఉపాధి హామీలు ఇస్తామని తెలిపారు... మొత్తానికి ఇంజనీరింగ్ విద్యార్థులకు పెద్ద గుడ్ న్యూస్ అని వినిపించింది జగన్ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: