గతంలో రఫెల్ యుద్ధ విమానాల విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం మొత్తం వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిండి అంటూ కాంగ్రెస్ పక్షాన నిలిచిన చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లో వుండకూడదు అనేవిధంగా విమర్శలు చేశారు. అయితే ఆనాడు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా.. రఫెల్ యుద్ధ విమానాలు విషయంలో కుంభకోణం విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేరు అంటూ విమర్శలు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల రఫెల్ యుద్ధ విమానాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి.
ఇటీవలె భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విదేశీ రఫెల్ యుద్ధ విమానాలు స్వదేశీ తేజస్సు విమానాలు భారత అమ్ములపొదిలో చేర్చుకొని మరింత శక్తివంతమైన భారత వైమానిక దళం దేశానికి గర్వకారణం.. వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రాణాలకు తెగించి దేశానికి విజయాలను అందిస్తున్న వీరులకి వారి కుటుంబానికి గౌరవ వందనం అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఇక బాబుగారి వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. ఒకప్పుడు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రఫెల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చి గొప్ప పని చేశారు అంటూ సమర్ధించడం అవకాశవాద రాజకీయానికి మారుపేరు అని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి