దీంతో చైనా రోజురోజుకు ప్రపంచ దేశాల ముందు దోషిగా మారిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే అటు పాకిస్థాన్ ఇటు చైనా కు సంబంధించిన ఆటలు సరిహద్దుల్లో సాగడం లేదు కాబట్టి ప్రస్తుతం సరిహద్దుల నుంచి కాకుండా భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా కీలక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రస్తుతం చైనా పాకిస్తాన్ దేశాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత రక్షణ రంగం విభాగం ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు భారత రక్షణ రంగ సమాచారాన్ని అందించే వారిని గుర్తిస్తూ అరెస్ట్ చేస్తూనే ఉంది.
ఇక ప్రస్తుతం వివిధ కంపెనీలను ఆకర్షిస్తూ భారత్ దూసుకుపోతున్న తరుణంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధం విడి భాగాలను తయారు చేసే ఎయిర్క్రాఫ్ట్ భాగంలో నాసిక్ డివిజన్కు చెందిన హెచ్ఏఎల్ కు సంబంధించినటువంటి అసిస్టెంట్ సూపర్వైజర్ దీపక్ శ్రీసక్ అనే వ్యక్తిని హాలీవుడ్ స్టైల్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కి చైనా కి కూడా భారత యుద్ధ పరికరాలు విభాగానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారు అంటూ అరెస్టు చేశారు. మరికొంతమంది ఇంటి దొంగలను పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి