దీంతో ప్రతిపక్షాలు అధికార పార్టీపై మరింతగా విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్టీలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని అంతేకాకుండా ముఖ్యమంత్రి తమను గౌరవించడం లేదు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఏకంగా ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేయడం ప్రస్తుతం త్రిపుర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది . ఇక త్రిపుర రాజకీయాల్లో ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు కూడా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి . అధికార పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని... మరింత బలంగా మారాలనుకుంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
ఈ క్రమంలోనే త్రిపుర రాజకీయాలు ఎంతో హాట్ హాట్ గా సాగుతున్నాయి. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ దేవ్ వైఖరిని నిరసిస్తూ ఇటీవలే 11 మంది ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రిపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 11 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పార్టీలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదని... గత అసెంబ్లీ ఎన్నికల్లో కష్ట పడిన వారికి అసలు గౌరవం ఇవ్వడం లేదు అంటూ బీజేపీ అధిష్టానానికి 11 మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి