వాయుగుండం ప్రభావంతో ఉదయం 8.30 నుంచి రాత్రి 11 గంటలవరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని సింగపూర్‌టౌన్‌షిప్‌లో రికార్డుస్థాయిలో 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని దక్షిణ హస్తినాపురంలో 29.13 సెం.మీ. వర్షపాతం నమోదైంది.హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ వద్ద వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో జోరువాన కురిసింది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో పత్తి ఎర్రబారగా, ఇప్పుడు ఉన్న కాయలు కూడా మురిగిపోయే పరిస్థితి వచ్చింది. పలుచోట్ల కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడిసింది.
వరద సహాయక చర్యల్లో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, పోలీస్, రెవిన్యూ, మెట్రో, వాటర్ వర్క్స్ అధికారులు, సిబ్బందిని పూర్తిగా నిమగ్నం చేసి.. సమన్వయంతో వ్యవహరించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. వరద పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు మేయర్. గత వందేండ్లలో ఎప్పుడూ లేని విధంగా నగరంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని ఆయన పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు నగరంలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నగర ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రజలకు సహాయక చర్యల విషయంలో అధికారులకు సహకరించాలని కోరారు. వరద ప్రభావిత కాలనీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లలోని యువకులు సైనికుల్లా ముందుకువచ్చి అధికారులు, సిబ్బందితో కలిసి వరద సహాయక చర్యల్లో స్వచ్చందంగా భాగస్వాములు కావాలని మేయర్ పిలుపునిచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి